News October 7, 2025

పెదబయలు: సెల్ టవర్ ఏర్పాటు చేయాలని డిమాండ్

image

పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సెల్ టవర్ లేక పంచాయతీ పరిధి 23 గ్రామాల గిరిజనులు 2 వేల మంది ఈకేవైసీ, ఆధార్ అనుసందనం, ఉద్యోగులు ముఖ హాజరు కోసం పడరాని పాట్లు పడుతున్నారని స్థానికులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రభుత్వం స్పందించి కిముడుపల్లి పంచాయతీలో సెల్ టవర్ ఏర్పాటుచేసి గిరిజనుల సెల్ సిగ్నల్ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

Similar News

News October 7, 2025

BREAKING.. జనగామ: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

image

గడ్డి మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యయత్నానికి పాల్పడిన జనగామ(D) స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో సోమవారం జరిగింది. ఈ ఘటనలో ప్రియుడు అన్వేశ్(26) మృతి చెందగా.. ప్రియురాలు పావని ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకోవడానికి పరిస్థితులు అనుకుంలించక పోవడంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

News October 7, 2025

కడపలో యువతి ఆత్మహత్యాయత్నం

image

కడపలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. నంద్యాల జిల్లాకు చెందిన యువతి రిమ్స్ డెంటల్ కాలేజీలో BDS ఫస్ట్ ఇయర్ చదువుతోంది. నిన్న ఉదయం 11 గంటలకు ఆమె ఎగ్జాం రాయాల్సి ఉంది. సరిగా పరీక్ష రాయలేనని భయాందోళనకు గురైంది. నిన్న ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత హాస్టల్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేసింది. వెంటనే రిమ్స్ క్యాజువాలిటీ వార్డుకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

News October 7, 2025

ఇంజినీరింగ్ అర్హతతో 2,570 పోస్టులు

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(RRB)2,570 పోస్టులకు ఈనెల 31 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఇంజినీరింగ్ అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రిపరేషన్ కొనసాగిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in