News November 30, 2025
పెదమల్లాపురంలో కొత్త ఐటీడీఏకు కేంద్రం సుముఖత: ఎంపీ

శంఖవరం మండలం పెదమల్లాపురం కేంద్రంగా నూతన ఐటీడీఏ (సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కేంద్రం నుంచి సమాచారం వచ్చిందని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 5 మండలాలు, 59 గిరిజన గ్రామాలతో ఈ కొత్త ఐటీడీఏను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
Similar News
News December 1, 2025
NGKL: నేటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
News December 1, 2025
జిల్లాలో వార్డులవారీగా ఆమోదం పొందిన నామినేషన్లు(తొలిదశ)

1. రుద్రంగి మండలం వార్డులు 86, నామినేషన్లు 162
2. చందుర్తి మండలం వార్డులు 174, నామినేషన్లు 393
3. వేములవాడ అర్బన్ మండలం వార్డులు 104, నామినేషన్లు 244
4. వేములవాడ రూరల్ మండలం వార్డులు 146, నామినేషన్లు 329
5. కోనరావుపేట మండలం వార్డులు 238, నామినేషన్లు 496
* మొత్తం వార్డు స్థానాలు 748
* ఆమోదం పొందిన నామినేషన్లు 1,624
News December 1, 2025
KNR: రెండో విడత.. మందకొడిగా నామినేషన్లు..!

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో విడత 418 గ్రామపంచాయతీలకు, 3,794 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత మొదటి రోజు మందకొడిగా నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ జిల్లా సర్పంచ్‌కి 121, వార్డు సభ్యులకు 209, సిరిసిల్ల జిల్లా సర్పంచికి 100, వార్డు సభ్యులకు 116, జగిత్యాల సర్పంచ్‌కి 171, వార్డు సభ్యులకు 238, పెద్దపల్లి సర్పంచ్‌కి 91, వార్డు సభ్యులకు 142 నామినేషన్లు దాఖలయ్యాయి.


