News January 5, 2025
పెదమానాపురం గేట్ మధ్యలో చిక్కుకున్న వ్యాన్..!

దత్తిరాజేరు మండలం పెదమానాపురం రైల్వే ట్రాక్ మధ్యలో ఆదివారం రాత్రి వ్యాన్ చిక్కుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండడం, రైళ్లు ఎక్కువగా వెళ్లడంతో మాటిమాటికీ గేట్ పడుతుంది. ట్రాఫిక్ క్లియర్ అయ్యేలోపు మళ్ళీ గేట్ వేసే క్రమంలో వ్యాన్ చిక్కుకుంది. దీంతో కాసేపు ఏం జరుగుతుందోనని గందరగోళం నెలకొంది. రైల్వే సిబ్బంది గమనించి ట్రైన్ వచ్చేలోపు గేట్ తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News September 29, 2025
VZM: పాల ప్యాకెట్ ధర తగ్గిందా?

ఇటీవల సవరించిన జీఎస్టి రేట్లతో పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయని పలు డెయిరీ యాజమాన్యాలు ప్రకటించాయి. విశాఖ డెయిరీలో మొత్తం 188 ఉత్పత్తుల్లో 94 ఉత్పత్తుల గరిష్ఠ పాల ఉత్పత్తుల <<17788908>>ధరలు తగ్గనున్నాయని<<>> తెలిపింది. పాలు లీటరుకు రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గనుందని వెల్లడించింది. పనీర్ కేజీ ప్యాకెట్ ధర రూ.20, నెయ్యి కేజీకి రూ.42 వరకు తగ్గుతాయని చెప్పింది. మరి క్షేత్రస్థాయిలో రేట్లు తగ్గాయా కామెంట్ చెయ్యండి.
News September 29, 2025
VZM: కలెక్టరేట్లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అర్జీదారులు Meekosam.ap.gov.in వెబ్ సైట్లో కూడా వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు.
News September 27, 2025
పైడిమాంబ సిరిమానోత్సవానికి సీఎంకు ఆహ్వానం

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అక్టోబర్ 6, 7 తేదీల్లో జరగనున్న సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు ఆహ్వానం పలికారు. రాష్ట్ర పండగగా జరిగే శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎంను ఆహ్వానించినట్లు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.