News April 7, 2025
పెద్దకొత్తపల్లి: అకాల వర్షానికి నేల రాలిన మామిడికాయలు

పెద్దకొత్తపల్లి మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పలుచోట్ల మామిడికాయలు రాలిపోయినట్లు రైతులు తెలిపారు. అరగంటకు పైగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో పలు గ్రామాలలో మామిడికాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షానికి మామిడికాయలు రాలిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.
Similar News
News April 9, 2025
చిలకలూరిపేట: విడదల రజిని బెయిల్‌పై తీర్పు రిజర్వ్

మాజీ మంత్రి విడదల రజిని హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్‌పై వాదనలు మంగళవారం ముగిశాయి. తీర్పుని హైకోర్టు రిజర్వ్ చేసింది. అప్పటి అడిగినంత సొమ్ము చెల్లించుకుంటే అంతు చూస్తామని, స్టోన్ క్రషర్‌ను మూసి వేయిస్తామని, క్వారీ యజమానులను బెదిరించారని, (ఏజీ) శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. పిటిషనర్‌లను కస్టడీలోకి తీసుకుని విచారించాలని ముందస్తు బెయిల్ పిటిషన్‌లు కొట్టి వేయాలని కోరారు.
News April 9, 2025
మ్యాక్స్‌వెల్‌కు షాక్.. డీమెరిట్ పాయింట్, 25% ఫైన్ విధింపు

PBKS ప్లేయర్ మ్యాక్స్‌వెల్‌కు IPL యాజమాన్యం షాకిచ్చింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ విధించడంతోపాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను అతని ఖాతాలో చేర్చింది. నిన్న CSKతో మ్యాచ్‌లో ఒక్క పరుగుకే ఔటైన అతను క్రికెట్ వస్తువులు, గ్రౌండ్ ఎక్విప్‌మెంట్‌ను దుర్భాషలాడినట్లు సమాచారం. ఇటీవల ఇషాంత్ శర్మకు సైతం ఇవే కారణాలతో ఫైన్, డీమెరిట్ పాయింట్ విధించారు. కాగా 4 డీమెరిట్ పాయింట్లకు ఒక మ్యాచ్ నిషేధం ఉంటుంది.
News April 9, 2025
వికారాబాద్‌లో రేపు జాబ్ మేళా

వికారాబాద్ ఐటీఐ క్యాంపస్‌లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ తెలిపారు. శ్రీమంత టెక్నాలజీస్ సంస్థలో ఉద్యోగాలు భర్తీకి ఈ మేళా నిర్వహిస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ పూర్తి చేసి 18-27ఏళ్లలోపు వారు అర్హులు. ఎంపికైన వారికి ఉచిత వసతి ఇస్తారు, HYDలో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఉదయం 10.30కి జాబ్ మేళా ప్రారంభం కానుంది.