News February 3, 2025
పెద్దగట్టులో భారీ బందోబస్తు
పెద్దగట్టు జాతరను పురస్కరించుకొని నిర్వహించిన దిష్టి పూజలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీఎస్పీ రవి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇద్దరు సీఐలు, 11 మంది ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News February 3, 2025
కామారెడ్డి BJP జిల్లా అధ్యక్షుడిగా రాజు
కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నీలం రాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు జిల్లా అధ్యక్షురాలిగా అరుణాతార పనిచేశారు. ఆమె స్థానంలో రాజును నియమించారు .అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆయన బీజేపీకి ఎన్నో సేవలు అందించారు. ఆయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించింది.
News February 3, 2025
నిధులు కేటాయించండి: పనగరియాకు చంద్రబాబు విజ్ఞప్తి
ఢిల్లీ పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అర్వింద్ పనగరియాను ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధుల అంశంపై ఆయనతో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం, నిధుల కేటాయింపులో పెద్ద మనస్సు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసిందని పనగరియా వద్ద నేతలు ప్రస్తావించారు.
News February 3, 2025
సోన్: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందిన ఘటన సోన్ మండలంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. పాక్‌పట్ల గ్రామానికి చెందిన నరసయ్య (48) తన పంట చేనుకు నీరు పెట్టడానికి సోమవారం ఉదయం వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు.