News February 20, 2025
పెద్దగట్టు జాతరకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం

సూర్యాపేట జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు యువకులు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు బైక్‌పై వెళ్లి వస్తుండగా సూర్యాపేట రూరల్ పరిధి కేసారం గ్రామం సమీపంలోని వాగులో పడ్డారు. ఈ ప్రమాదంలో కాసరాబాద్ గ్రామానికి చెందిన సుధీర్(21) మృతి చెందగా, సంపత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 22, 2026
కంబదూరు మండలంలో విషాదం

అనంతపురం జిల్లా కంబదూరు మండలం మర్రిమాకుల పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎద్దుల బండి బోల్తా పడటంతో గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు(57) మృతి చెందారు. ఈయన ఎద్దుల బండిని తోలుకుంటూ పొలానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 22, 2026
కంబదూరు మండలంలో విషాదం

కంబదూరు మండలం మర్రిమాకుల పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎద్దుల బండి బోల్తా పడటంతో గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు(57) మృతి చెందారు. ఈయన ఎద్దుల బండిని తోలుకుంటూ పొలానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 22, 2026
నిర్మల్: ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాల షెడ్యూల్!

‘అరైవ్ అలైవ్’ 7 రోజుల షెడ్యూల్ ఇదే.
1వ రోజు రోడ్డు భద్రతపై అవగాహన, ప్రచారం
2వ రోజు లేన్ డిసిప్లిన్, తప్పుడు ఓవర్ టేకింగ్‌పై తనిఖీలు
3వ రోజు హెల్మెట్ వాడకంపై స్పెషల్ డ్రైవ్
4వ రోజు సీట్‌బెల్ట్ నిబంధనల అమలు
5వ రోజు మద్యం సేవించి వాహనం నడిపేవారిపై నిఘా, బ్రెత్ అనలైజర్ పరీక్షలు
6వ రోజు భారీ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ
7వ రోజు డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై అవగాహన.


