News February 5, 2025
పెద్దగట్టు జాతరపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు జాతరపై అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని, జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి వసతి, వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. వారి వెంట పెద్దగట్టు ఛైర్మన్ నర్సయ్య, అదనపు కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీ రవి ఉన్నారు.
Similar News
News February 5, 2025
విశాఖ డివిజన్ పరిధిలోకి వచ్చే రైల్వే లైన్లు ఇవే
➤ పలాస – <<15366937>>విశాఖపట్నం<<>> – దువ్వాడ
➤ కూనేరు – విజయనగరం
➤ నౌపడ – పర్లాకిముండి
➤ బొబ్బిలి – సాలూరు
➤ సింహాచలం నార్త్ – దువ్వాడ బైపాస్
➤ వడ్లపుడి – దువ్వాడ
➤ విశాఖ స్టీల్ ప్లాంట్ – జగ్గయ్యపాలెం
News February 5, 2025
తొలిసారి Girl Friend గురించి చెప్పిన బిల్‌గేట్స్
తనకు సరైన ప్రేయసి దొరికిందని, ఆమెతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ అన్నారు. తామిద్దరం కలిసి ఒలింపిక్స్, అనంత్ అంబానీ పెళ్లి సహా ప్రపంచమంతా చుట్టేస్తున్నామని తెలిపారు. చాలా సరదాగా గడుపుతున్నామని వెల్లడించారు. ఒరాకిల్ మాజీ CEO మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డే ఆయన ప్రేయసి. 2019లో భర్త చనిపోయాక ఆయన వద్దకు చేరారు. కొన్ని కారణాలతో గేట్స్‌తో మిలిండా విడాకులు తీసుకోవడం తెలిసిందే.
News February 5, 2025
వివేకా హత్య కేసులో కీలక పరిణామం
AP: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. 2023లో తనను ఇబ్బంది పెట్టారని అతను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు DSPగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల మాజీ CI ఈశ్వరయ్య, కడప జైలు మాజీ సూపరింటెండెంట్ ప్రకాశ్‌పై కేసులు నమోదయ్యాయి.