News February 16, 2025

పెద్దగట్టు జాతర.. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

image

HYD నుంచి VJW, KMM వెళ్లే వాహనదారులకు SRPT పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించింది. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన SRPT పెద్దగట్టు నేపథ్యంలో ఆయా రూట్లో వాహనాలను మళ్లిస్తున్నారు. జాతర నేటి నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనుంది. జాతరకు తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల ప్రజలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో రద్దీ తగ్గే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు.

Similar News

News November 14, 2025

కేసీఆర్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది: రేవంత్

image

TG: కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని, ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రెస్‌మీట్లో మాట్లాడుతూ ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్‌ను విమర్శించడం భావ్యం కాదు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక స్పందిస్తా. ఆయన కుర్చీ గుంజుకోవడానికి కేటీఆర్, హరీశ్ ప్రయత్నిస్తున్నారు. వారి పరిస్థితి ఏంటో చూద్దామని జూబ్లీహిల్స్‌లో నిరూపించుకోవాలని వదిలేశారు’ అని వ్యాఖ్యానించారు.

News November 14, 2025

సంబంధం లేని వ్యక్తులు CID విచారణలో: భూమన

image

CIDకి సంబంధం లేని వ్యక్తి తిరుమల <<18287141>>పరకామణి <<>>కేసు విచారణ చేపడుతున్నారని భూమన ఆరోపించారు. ‘లక్ష్మణరావు అనే వ్యక్తి విచారణ పేరుతో సతీశ్‌ను బండబూతులు తిట్టాడు. సీఐడీలో భాగస్వామి కానీ వ్యక్తి విచారణలో ఏవిధంగా పాల్గొంటారు. న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు’ అని భూమన విమర్శించారు.

News November 14, 2025

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం: కలెక్టర్

image

ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యానికి, పర్యావరణానికి, రైతులకు లాభదాయకమని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. స్థానిక యూత్ క్లబ్‌లో నిర్వహించిన రిసోర్స్ పర్సన్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం పెరగడంతో భూమి సారం తగ్గిపోగా, అవశేషాలు ఆహారం ద్వారా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. సహజ ఎరువులు భూమి సారాన్ని పెంపొందిస్తాయని చెప్పారు.