News December 30, 2024
పెద్దగట్టు జాతర.. ఐదు రోజుల కార్యక్రమాలు ఇవే..
రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో జాతర దురాజ్‌పల్లి (పెద్దగట్టు) జాతర. ఈ జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు 5 రోజుల పాటు వైభవంగా జరగనుంది. మొదటి రోజు దేవరపెట్టే తరలింపు, 2వ రోజు కంకణ అలంకరణలు, 3వ రోజు స్వామివారి చంద్రపట్నం, 4వ రోజు దేవరపెట్టే కేసారం తరలింపు, 5వ రోజు మకరతోరణం తొలగింపుతో జాతర ముగుస్తుంది. ఇప్పటికే అధికారులు జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News January 2, 2025
NLG: ఇంటర్ విద్యార్థి సూసైడ్
పేరెంట్స్ మందలించడంతో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన మర్రిగూడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. శివన్నగూడెంకు చెందిన గణేశ్ ఇంటర్ చదువుతున్నాడు. టైం అవుతోందని కాలేజీకి వెళ్లమని గణేశ్ తండ్రి ఇంద్రయ్య మందలించాడు. మనస్తాపంతో పొలం దగ్గర పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.
News January 2, 2025
సూర్యాపేట: రూ.1,500 కోసం కొట్టుకున్న పోలీసులు
రూ.1,500 కోసం కానిస్టేబుల్, హోంగార్డు ఘర్షణ పడిన ఘటన పెన్‌పహాడ్‌లో జరిగింది. SI గోపికృష్ణ తెలిపిన వివరాలు.. పెన్‌పహాడ్‌లో ఓ టీ స్టాల్ దుకాణదారుడు కానిస్టేబుల్ రవికుమార్‌కు, హోంగార్డు శ్రీనుకు రూ.1500 క్రిస్మస్ ఇనాం ఇచ్చాడు. వీటిని పంచుకునే విషయంలో DEC 28న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయం SP సన్‌ప్రీత్ సింగ్ దృష్టికి వెళ్లగా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. హోంగార్డును SPఆఫీస్‌కు అటాచ్ చేశారు.
News January 2, 2025
నల్గొండ జిల్లాలో రూ.69.64కోట్ల మద్యం అమ్మకాలు..!
నల్గొండ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటాయి. ఉమ్మడి జిల్లాలో డిసెంబర్ 30,31వ తేదీల్లో 69.64 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. జిల్లాలోని 7 సర్కిల్‌లో 2 రోజుల్లో 29.59 కోట్ల అమ్మకాలు జరగగా, సూర్యాపేట జిల్లాలోని 4 సర్కిల్‌లలో 20.9 కోట్లు, యాదాద్రి భువనగిరిలోని 4 సర్కిల్‌లలో 19.15 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు డిసెంబర్ నెలలో రూ.366.92 కోట్ల ఆదాయం సమకూరింది.