News February 16, 2025

పెద్దగట్టు: జాతర భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసిన ఎస్పీ

image

దురాజ్పల్లి పెద్దగట్టు జాతర నేడు అర్ధరాత్రి నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ తాజాగా తనిఖీ చేశారు. జాతర సరళిని పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. ఆయన వెంట అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, AR అధనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, DSP రవి, శ్రీధర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, SI, సిబ్బంది ఉన్నారు.

Similar News

News September 16, 2025

పాలకొల్లు: స్కూలు బస్సు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

image

పాలకొల్లులో సోమవారం బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన పోడూరు మండలం పెనుమదం గ్రామానికి చెందిన ఏలూరి శ్రీను మృతి చెందాడు. శ్రీను తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కొబ్బరి వలుపు పని నిమిత్తం శ్రీను పాలకొల్లుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News September 16, 2025

JAN నుంచి ఎక్కడా చెత్త కనిపించకూడదు: CBN

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి OCT 2 వరకు ‘స్వచ్ఛతా హీ సేవ’ చేపట్టాలని CM చంద్రబాబు ఆదేశించారు. ‘ఇంట్లో చెత్తను రోడ్డుపై వేయటం కొందరికి అలవాటు. కాలువల్లో చెత్త వేస్తే ప్రవాహానికి అడ్డుపడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో CC రోడ్లున్నా డ్రెయిన్లు సరిగ్గా లేవు. మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించాలి. గ్రామాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. జనవరి నుంచి ఎక్కడా చెత్త కనిపించకూడదు’ అని కలెక్టర్లకు సూచించారు.

News September 16, 2025

VZM: ప్రత్యేక అలంకరణలో పైడిమాంబ

image

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారిని ఆలయ అర్చకులు సుందరంగా అలంకరించారు. మంగళవారం సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు చదురు గుడిలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపించి వివిధ రకాల పుష్పాలతో ముస్తాబు చేశారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సిరిమానోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలో అమ్మవారు శోభిల్లుతున్నారు.