News December 16, 2025

పెద్దచింతకుంట సర్పంచ్ ఎన్నికపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

image

మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మమ్మ ఒక్క ఓటుతో ఓటమి చెందినట్టు అధికారులు అధికార పార్టీ అభ్యర్థికి గెలుపు ధ్రువపత్రం ఇవ్వడం పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘానికి మంగళవారం బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మమ్మ ఫిర్యాదు చేశారు. రికౌంటింగ్ నిర్వహించాలని కోరిన అధికారులు అధికార పార్టీకి ఉత్తసు పలికినట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి న్యాయం చేయాలన్నారు.

Similar News

News December 17, 2025

Avatar-3కి షాకింగ్ రివ్యూస్

image

ఈనెల 19న రిలీజ్ కాబోతున్న అవతార్3కి కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఇప్పటికే రివ్యూస్ ఇచ్చేస్తున్నాయి. BBC, గార్డియన్, రోటెన్ టొమాటోస్, IGN సహా మీడియా హౌజెస్ మూవీ స్టోరీ ఆకట్టుకోదని చెబుతున్నాయి. కామెరూన్ టేకింగ్, యాక్షన్ బాగున్నా కొన్ని సీన్స్ గతంలో చూశాం అనే ఫీల్ కల్గిస్తాయట. BBC 1/5, గార్డియన్ 2/5 రేటింగ్ ఇచ్చాయి. కాగా అవతార్1కు మంచి రెస్పాన్స్ రాగా, పార్ట్2ను క్రిటిక్స్ ఓకే అన్నారు.

News December 17, 2025

ఉండవెల్లి: పోలింగ్ సమయం పూర్తి.. భద్రత కట్టుదిట్టం

image

మూడవ దశ పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది ఫలితమే మిగిలింది. జిల్లా వ్యాప్తంగా 68 గ్రామపంచాయతీలలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరు ఒంటిగంట దాటిన తర్వాత వెంటనే ప్రవేశాలను మూసివేశారు. సమయంలోపు పోలింగ్ స్టేషన్లోకి వచ్చిన ఓటర్లకు ఓటు వేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అధికారులు. 144 సెక్షన్ అమల్లో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 80 శాతం పోలింగ్ జరిగినట్లు అంచనా.

News December 17, 2025

విలాసాగర్‌లో ఓటుకు నోటు.. సర్పంచ్‌ అభ్యర్థిని పట్టుకున్న పోలీసులు

image

జమ్మికుంట మండలం విలాసాగర్‌లో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థి రాచపల్లి వంశీ తన అనుచరులతో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎలక్షన్ జరుగుతుండగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పంచుతున్న నగదు రూ.28,500 స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు అన్నారు.