News February 26, 2026

పెద్దన్నను కాదని భారత్‌కు ఇజ్రాయెల్ సాయం

image

దౌత్య సంబంధాలు లేని 1971లోనే అమెరికాను ఎదిరించి మరీ భారత్‌కు ఇజ్రాయెల్ రహస్యంగా ఆయుధాలు, శిక్షణ అందించింది. 1980లలో పాక్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకూ ఆఫర్ ఇచ్చింది. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’కూ ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో వాషింగ్టన్ కంటే ఢిల్లీనే ఎక్కువగా నమ్ముతామని నెతన్యాహు గతంలో ప్రకటించారు. రక్షణ, వ్యవసాయం, AI రంగాల్లో ఇరు దేశాల సహకారం ఇప్పుడు మరింత బలోపేతమైంది.

Similar News

News February 27, 2026

అమెరికాపై తగ్గిన ఆసక్తి.. అందుకేనా?

image

USపై భారతీయ విద్యార్థుల ఆసక్తి తగ్గుతోంది. 2025లో అక్కడి వర్సిటీలకు అప్లై చేసిన విద్యార్థుల సంఖ్య 45% తగ్గినట్లు గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ వెల్లడించింది. వీసా, ఉద్యోగ అవకాశాల్లో సవాళ్లు, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక భారం ఇందుకు కారణాలు. ఐరోపా (యూకే మినహా), ఆసియా దేశాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. కాగా భారత్‌లోని బిజినెస్ స్కూల్స్‌లో విదేశీ విద్యార్థుల అడ్మిషన్స్ 25% పెరిగాయి.

News February 27, 2026

హీరో విజయ్ భార్య సంగీత నేపథ్యమిదే..

image

తమిళ స్టార్ హీరో విజయ్ <<19254560>>భార్య సంగీత<<>> శ్రీలంక తమిళ ఫ్యామిలీకి చెందిన మహిళ. ఈమె తండ్రి యూకేలో వ్యాపారవేత్త కావడంతో ఆమె అక్కడే జన్మించారు. అభిమానిగా విజయ్‌కు సంగీత పరిచయమయ్యారు. ఆపై వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి 1999లో పెళ్లి చేసుకున్నారు. విజయ్ దంపతులకు జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలున్నారు. లోప్రొఫైల్ మెయింటెన్ చేసే ఈమె భర్తకు సంబంధించిన సినిమా, పొలిటికల్ ఈవెంట్లలోనూ పెద్దగా కనిపించరు.

News February 27, 2026

మార్చి 1 నుంచి పెరగనున్న ఫోన్ ధరలు

image

వివో, iQOOలోని పలు మోడల్స్ ధరలు MAR 1 నుంచి పెరగనున్నట్లు తెలుస్తోంది. Vivo T4 బేస్ వేరియంట్ ₹22,999 ఉండగా ₹26,999కు పెరగనుంది. మిడ్, టాప్ వేరియంట్లూ ₹2వేలు పెరగనున్నాయి. Vivo T4R వేరియంట్లపై చెరో ₹2వేలు, T4Xకు ₹1500 పెరగనుంది. iQOO Z10, iQOO Z10R మోడళ్లు ₹2వేలు పెరగనున్నాయి. ఇక iQOO Z10x బేస్ వేరియంట్‌పై ₹1500, మిడ్, టాప్ వేరియంట్లు ₹2500 పెరగనున్నాయి. ఇప్పటికే శాంసంగ్‌ కూడా ధరలు పెంచింది.