News February 24, 2026

పెద్దపల్లిలో కవల నవజాత శిశువులకు విజయవంతమైన చికిత్స

image

పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో నెలలు నిండక తక్కువ బరువుతో జన్మించిన కవల శిశువులకు అత్యుత్తమ చికిత్స అందించారు. శ్వాసకోశ సమస్యలతో అడ్మిట్ అయిన శిశువులకు డా. వాసుదేవరెడ్డి నేతృత్వంలో వైద్య బృందం CPAP ద్వారా ఆక్సిజన్, అవసరమైన మందులు అందించి కోలుకునేలా చేశారు. 19 రోజుల చికిత్స అనంతరం ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశారు. వైద్యులు, ఎస్ఎన్‌సీయూ సిబ్బందిని సూపరింటెండెంట్ డా. శ్రీధర్ అభినందించారు.

Similar News

News February 25, 2026

పార్వతీపురం: ‘గర్భిణీల్లో ప్రమాదకర లక్షణాలను సకాలంలో గుర్తించాలి’

image

గర్భిణీల్లో ప్రమాదకర లక్షణాలను ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స, పర్యవేక్షణ చేయాలని DMHO డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. హైరిస్క్ గర్భిణీల ఆరోగ్య నిర్వహణ, నియమాలపై వైద్యాధికారులకు ఓరియంటేషన్‌ శిక్షణను పార్వతీపురంలోని ఎన్జీవో హోమ్‌లో బుధవారం నిర్వహించారు. గర్భిణీల్లో ప్రధాన హైరిస్క్ సమస్యలైన అక్లాంప్సియా, యుక్త వయసులో గర్భం దాల్చడం, దీర్ఘంగా ఉండే జ్వర లక్షణాలు సకాలంలో గుర్తించాలన్నారు.

News February 25, 2026

VZM: మార్చి 2న JNTU జీవీలో యూత్ పార్లమెంట్

image

విజయనగరం JNTU జీవీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మార్చి 2న యూత్ పార్లమెంట్ నిర్వహిస్తామని జిల్లా యువజన అధికారి ప్రేమ భరత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వీసీ ప్రొఫెసర్ సుబ్బారావు బుధవారం ఆవిష్కరించారు. 18 నుంచి 25 ఏళ్లలోపు విజయనగరం జిల్లా యువతీ, యువకులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు అన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 28 లోగా పేర్లను మైభారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News February 25, 2026

పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్

image

AP: పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యాలకు పరీక్షల విభాగం కీలక సూచనలు చేసింది. నామినల్ రోల్స్‌లో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో దొర్లిన తప్పులను సరిదిద్దుకోవడానికి FEB 26 నుంచి 28 వరకు అవకాశం ఇచ్చింది. ఆధార్ కార్డులోని డేటా ఆధారంగానే UDISE+ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. కాగా మార్చి 16 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం అవుతాయి.