News December 24, 2025
పెద్దపల్లిలో ప్రిమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పెద్దపల్లిలో జూనియర్ కళాశాల మైదానంలో మొదటిసారిగా పెద్దపల్లి ప్రిమియర్ లీగ్ (PPL) క్రికెట్ టోర్నమెంట్‌ను MLA చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి, యువతను చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉంచి క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని సూచించారు. టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి జట్టుకూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News December 25, 2025
GNT: నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం షెడ్యూల్‌ను ఆయన వ్యక్తిగత కార్యదర్శి విడుదల చేశారు. ఉదయం 10.55 గంటలకు వెంకటపాలెం వెళ్తారు. 11 గంటలకు మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతారు. తిరిగి మధ్యాహ్నం 1.10 గంటలకు నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు వెంకటపాలెంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
News December 25, 2025
సూర్యాపేట: ”ఆయన”ను పక్కకు పెడితే బెటర్

గ్రామాల్లో మహిళా సర్పంచుల పరిపాలన వ్యవహారాలు భర్తలే చూసుకున్న ఘటనలు గతంలో చూశాం. మహిళా ప్రతినిధులను కేవలం సంతకాలకే పరిమితం చేస్తూ, పురుషాధిపత్యం కొనసాగితే రిజర్వేషన్ల ఆశయం నీరుగారుతుందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, లేనిపక్షంలో అది “పెత్తనం ఆయనదే” అన్న చందంగా మారుతుందని వాదిస్తున్నారు.
News December 25, 2025
నంద్యాల జిల్లాలోనే అతి పురాతన, పెద్ద చర్చి ఇదే..!

1881లో నంద్యాలకు వచ్చిన మొదటి మిషనరీలు ఆర్థర్ ఇన్మాన్, ఆల్ఫ్రెడ్ బ్రిటన్ 1905లో నంద్యాలలో హోలీ క్రాస్ చర్చిని నిర్మించారు. ఈ చర్చి నంద్యాల జిల్లాలోనే అతిపెద్ద చర్చిగా కీర్తి పొందింది. 120 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ చర్చి చెక్కుచెదరలేదు. ఆ ప్రాంతానికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.


