News January 8, 2026
పెద్దపల్లిలో 123 సీనియర్ సిటిజన్ కేసులకు పరిష్కారం

PDPL జిల్లాలో వయోవృద్ధులకు సంబంధించిన 123 సీనియర్ సిటిజన్ ఫిర్యాదులకు పరిష్కారం చూపినట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మొత్తం 152 ఫిర్యాదులు నమోదు కాగా 29 కేసులు పరిష్కార దశలో ఉన్నాయన్నారు. తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదేనని స్పష్టం చేశారు. వయోవృద్ధులు ముందుగా సంబంధిత ఆర్డీఓ వద్ద ఫిర్యాదు నమోదు చేయాలని, అక్కడ పరిష్కారం కానీ పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
Similar News
News February 11, 2026
మనస్సును ప్రశాంతంగా మార్చే భైరవీ ముద్ర

సుఖాసనంలో కానీ పద్మాసనం/వజ్రాసనంలో కూర్చోవాలి. నడుం వంగకుండా నిటారుగా ఉండేలా చూడాలి. రెండు చేతులను ఒళ్లో ఉంచి ఒక అరచేతిలో ఇంకో అరచేయి పెట్టి ఉంచాలి. కుడి చేయి పైన , ఎడమ చేయి కింద ఉండేవిధంగా చూసుకోవాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాసతీసుకుని వదులుతూ శ్వాసమీద ధ్యాసను ఉంచాలి. కనీసం 7నిమిషాల సమయం ఈ భైరవి ముద్రలో ఉంటే మనస్సు ప్రశాతంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
News February 11, 2026
కర్నూలుపై నంద్యాల జట్టు భారీ విజయం

కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న MA ఇస్పహాన్ మెమోరియల్ ట్రోఫీ అండర్-14 లీగ్ మ్యాచ్‌లో మంగళవారం నంద్యాల(సి) జట్టు ఘన విజయం సాధించింది. కర్నూలు(సి) జట్టుపై 125 పరుగుల భారీ తేడాతో గెలిచినట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి దేవేంద్ర గౌడ్ తెలిపారు. నంద్యాల జట్టు ప్లేయర్ శ్రీవేంద్రనాథ్ 71 పరుగులతో పాటు 5 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. ధనుష్ సాయి 5 వికెట్లు పడగొట్టాడు.
News February 11, 2026
మొక్కజొన్నను ఆశించే తెగుళ్లు – నివారణ

మొక్కజొన్న నాటిన 30 రోజుల దశలో పేనుబంక ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ml, ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. నల్లులు ఆశించకుండా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నల్లులు ఆశిస్తే లీటరు నీటిలో డైకోఫాల్ 50mlను కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1ml వేప నూనెను 5 గ్రాముల సబ్బుపొడిలో కలిపి పిచికారీ చేయాలి.


