News February 3, 2025
పెద్దపల్లిలో MLC కవిత పర్యటన
పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత నేడు పర్యటిస్తారని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష తెలిపారు. రంగాపూర్‌లో కార్మిక నాయకుడు కౌశిక్ హరి కూతురి వివాహానికి హాజరుకానున్నారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం 12:15కు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసంలో నిర్వహించే టీబీజీకేఎస్ నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారన్నారు.
Similar News
News February 3, 2025
BREAKING: తెలుగు నిర్మాత ఆత్మహత్య
సినీ నిర్మాత, డ్రగ్ పెడ్లర్ కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినిమా రంగంలోకి వచ్చారు. తెలుగులో కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. 2023లో ఆయన దగ్గర 93 గ్రా. కొకైన్ దొరకడంతో పోలీసులు అరెస్టు చేశారు.
News February 3, 2025
ట్రంప్ సుంకాలు.. ఆందోళన లేదు: ఆర్థిక మంత్రి నిర్మల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘సుంకాల గురించి ఎలాంటి ఆందోళనా లేదు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. పరోక్షంగా ప్రభావం ఉండొచ్చు. మా ప్రధాన లక్ష్యం ఆత్మనిర్భరతే’ అని పేర్కొన్నారు.
News February 3, 2025
పెద్దపల్లి: MLC కవితకు ఘన స్వాగతం..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చిన సందర్భంగా పెద్దపల్లి మండలంలోని పెద్దకాల్వల వద్ద BRS శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా నాయకులు కవితకు పుష్పగుచ్ఛం ఇవ్వగా.. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.