News January 2, 2026
పెద్దపల్లిలో PM విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన శిక్షణ

పెద్దపల్లిలో MSME-DFO ఆధ్వర్యంలో PM విశ్వకర్మ పథకం లబ్ధిదారుల కోసం శుక్రవారం ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయ వృత్తిదారులు, కళాకారుల సామర్థ్య అభివృద్ధే లక్ష్యంగా ఈ శిక్షణ జరిగింది. ముఖ్య అతిథిగా వడ్డేపల్లి రాంచందర్ పాల్గొన్నారు. ఉత్పత్తి డిజైనింగ్, లేబులింగ్, మార్కెటింగ్ అవకాశాలు, అమ్మకాల వ్యూహాలు, డిజిటల్ లావాదేవీలకు QR కోడ్ వినియోగంపై ప్రాయోగిక అవగాహన కల్పించారు.
Similar News
News January 3, 2026
కొండగట్టు: పవన్‌తో పాల్గొననున్న ప్రముఖులు వీరే..!

కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఏపీ శాసనమండలి విప్ హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, టీటీడీ బోర్డు మెంబర్లు ఆనందసాయి, మహేందర్, టీటీడీ ఎల్ఏసి చైర్మన్ శంకర్ గౌడ్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శివశ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఆదిరెడ్డి పాల్గొననున్నారు.
News January 3, 2026
నల్లమల సాగర్‌కు రేవంత్ పరోక్ష అంగీకారం: హరీశ్‌రావు

నీటి వివాదాలపై ఇరు రాష్ట్రాలు పంపిన పేర్లకు కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిపి <<18742119>>కమిటీ<<>> ఖరారు చేసినట్లు మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. ‘3నెలల్లో నీటి పంపకాలు పూర్తి చేయడమంటే 3 నెలల్లో నల్లమల సాగర్‌ను ఆమోదించడమే. ఇందుకు AP పెట్టిన టెండర్ గడువు తీరాకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అంటే రేవంత్ సర్కార్ ఆ ప్రాజెక్టును పరోక్షంగా అంగీకరిస్తోందని అర్థమవుతోంది’ అని ట్వీట్ చేశారు.
News January 3, 2026
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జాతీయ రహదారులను కప్పేసిన పొగ మంచు
> జర్మనీలో జనగామ వాసి మృతి
> అసెంబ్లీలో నిర్వహించిన నిరసనలో పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే
> దేవరుప్పుల: ఇసుక అనుమతిని రద్దు చేయాలని నిరసన
> జనగామ: ట్రాఫిక్ ఐలాండ్ ఢీకొన్న లారీ
> సోమేశ్వరుడికి రూ.18.04 లక్షల ఆదాయం
> యువతకు జాబ్ గ్యారంటీతో ఉచిత స్కిల్ ట్రైనింగ్: కలెక్టర్
> పొగ మంచులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: డీసీపీ


