News March 3, 2026
పెద్దపల్లి: అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు: SE

పెద్దపల్లి సర్కిల్‌లో విద్యుత్ లేని 69 అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని SE వి.గంగాధర్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ లేని కేంద్రాలను గుర్తించి, అంతర్గత వైరింగ్, ఇతర సదుపాయాలతో పాటు విద్యుత్ సేవలను వేగంగా అందిస్తున్నామన్నారు.
Similar News
News March 3, 2026
మంగళగిరిలో హనుమాన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

వన్యప్రాణి సంహారాన్ని నివారించి, కో-లివింగ్ వైపు మలచడమే హనుమాన్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం మంగళగిరి 6వ బెటాలియన్‌లో ఈ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. వన్యప్రాణుల వల్ల పంట, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రత్యేక వాహనాలను ప్రారంభించిన పవన్.. అటవీ శాఖ చరిత్రలో ఇది కీలక రోజని అభివర్ణించారు.
News March 3, 2026
ఆయనకు TTD ఛైర్మన్ పదవి ఎలా ఇచ్చారు: రోజా

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ మంత్రి రోజా విమర్శలు చేశారు. ‘BR నాయుడిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించిన దగ్గరి నుంచి తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. అయినా ఆయనపై చర్యలు లేవు. బీఆర్ నాయుడు గురించి మీకు ముందే తెలిసి కూడా ఆయనకు ఛైర్మన్ పదవి ఎలా ఇచ్చారు చంద్రబాబు గారూ?’ అంటూ రోజా ట్వీట్ చేశారు.
News March 3, 2026
ఎటపాకలో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

ఎటపాక (M) బాసువాగు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. భద్రాచలం నుంచి ఎటపాకకు వస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఆటోలో ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు గౌరీదేవిపేట గ్రామానికి చెందిన పైలా సాయిగా సమాచారం.


