News November 22, 2025
పెద్దపల్లి: అట్టర్ ఫ్లాప్ సీఎం రేవంత్ రెడ్డి: మాజీ ఎమ్మెల్యే

అట్టర్ ఫ్లాప్ సీఎం రేవంత్ రెడ్డి అని RMG Ex.MLA కోరుకంటి చందర్ ఘాటుగా విమర్శించారు. PDPLలోని BRS జిల్లా కార్యాలయంలో శుక్రవారం PDPL Ex.MLA మనోహర్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పాలన చేతగాక CM రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫార్మూలా ఈ కార్ రేసింగ్ కేసు తెరపైకి తెచ్చారని, ఇది కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న డ్రామా అన్నారు.
Similar News
News November 22, 2025
Al Falah: వందల మంది విద్యార్థుల భవిష్యత్తేంటి?

ఢిల్లీ పేలుడు <<18325633>>ఉగ్ర మూలాలు<<>> అల్ ఫలాహ్ వర్సిటీలో బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే వర్సిటీ ఛైర్మన్ సహా పలువురు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో వందల మంది మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. వర్సిటీ, కాలేజీల గుర్తింపులు రద్దయితే అంతా కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. కెరీర్, NEET కష్టం, ₹లక్షల ఫీజులు వృథా అవుతాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమను ఎక్కడా నమ్మరని బాధపడుతున్నారు.
News November 22, 2025
నిర్మల్: మండలాలకు ఫాగింగ్ మెషీన్ల పంపిణీ

జిల్లాలోని పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 18 ఫాగింగ్ యంత్రాలను మండలానికి ఒకటి చొప్పున ఎంపీఓలకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అందించారు. ఫాగింగ్ యంత్రాలను సమర్ధవంతంగా వినియోగించాలని సూచించారు. దోమలను సమూలంగా నిర్మూలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు.
News November 22, 2025
సున్నాకే 2 వికెట్లు.. వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?

ACC రైజింగ్ స్టార్స్ టోర్నీ సెమీస్‌లో భారత్-A ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే. <<18351593>>సూపర్ ఓవర్‌లో<<>> ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోవడంతో బంగ్లా ఈజీగా గెలిచేసింది. ఈ నేపథ్యంలో ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని సూపర్ ఓవర్‌లో ఎందుకు బ్యాటింగ్‌కు పంపలేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ బ్లండర్ మిస్టేక్ వల్ల మ్యాచ్ ఓడిపోయామని మండిపడుతున్నారు. వైభవ్ ఆడుంటే ఇంకోలా ఉండేదని అంటున్నారు. మీరేమంటారు?


