News February 15, 2025

పెద్దపల్లి: అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష

image

మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో పెద్దపల్లి కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వేణు సమీక్షించారు. గంజాయితో పాటు గుడుంబా నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వారికి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. గోదావరిఖనిలో 10 పడకల డీఅడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏసీపీ కృష్ణ, రమేశ్, DAO ఆదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 14, 2026

మక్తల్: డిగ్రీ చదువుతూనే.. కౌన్సిలర్‌గా విజయం!

image

మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 22 ఏళ్ల అల్కూరి పావని సంచలనం సృష్టించారు. 16వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న పావని, విద్యార్థి దశలోనే కౌన్సిలర్‌గా ఎన్నికవ్వడంపై సర్వత్ర ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. వార్డు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె వెల్లడించారు.

News February 14, 2026

HYD: అత్తపై అత్యాచారం.. అల్లుడికి 10ఏళ్ల జైలు

image

నాచారం PS పరిధిలో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడికి కుషాయిగూడ సెషన్స్ న్యాయస్థానం శిక్ష విధించింది. 2022లో అత్తపై అత్యాచారం చేసిన అల్లుడు రమేశ్(38)కి 10ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్ వాదనలను సమర్థించిన కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అప్పటి ఇన్‌స్పెక్టర్ మహేశ్ పకడ్బందీగా సాక్ష్యాలు సమర్పించడంతో నిందితుడికి శిక్ష ఖరారైంది.

News February 14, 2026

నేరేడుచర్లలో దంపతుల ఘనవిజయం

image

నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన భార్యాభర్తలు కొనేతం మంజుల, చిన వెంకటరెడ్డి కౌన్సిలర్లుగా గెలిచి అరుదైన విజయం నమోదు చేశారు. మంజుల 4వ వార్డు నుంచి, వెంకటరెడ్డి 15వ వార్డు నుంచి ఘనవిజయం సాధించారు. ఒకే ఇంట్లో ఇద్దరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడం పట్టణంలో విశేషంగా మారింది. ఈ గెలుపుపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.