News April 3, 2025

పెద్దపల్లి: అనుమానాస్పద స్థితిలో ఆర్టిజన్ ఉద్యోగి మృతి

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ ప్రాంతంలోని ఒక అద్దె ఇంట్లో విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగి ఒడ్డబోయిన రాజుకుమార్ గురువారం తెల్లవారు జామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు మంథని డివిజన్ కమ్మంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్లో ఆర్టిజన్ ఉద్యోగిగా పని చేస్తుంటాడు, పెద్దపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News July 7, 2025

స్వర్ణాల చెరువుకు క్యూ కట్టిన భక్తులు

image

నెల్లూరులో రొట్టెల పండగ ఘనంగా జరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. రెండో రోజు స్వర్ణాల ఘాట్ వద్ద భక్తుల సందడి నెలకొంది. పలువురు రొట్టెలను మార్చుకున్నారు. తర్వాత బారా షాహిద్ దర్గాలో ప్రార్థనలు చేశారు. రొట్టెల పండగలో ముఖ్యమైన గంధోత్సవం ఇవాళ రాత్రికి జరగనుంది. మీరూ రొట్టెల పండగకు వెళ్లారా? ఏ రొట్టె తీసుకున్నారు? ఏ రొట్టె ఇచ్చారు? కామెంట్ చేయండి.

News July 7, 2025

HYD: కాలుకు సర్జరీ.. గుండెపోటుతో బాలుడి మృతి

image

కాలుకు సర్జరీ చేసిన అనంతరం గుండెపోటు రావడంతో 7 ఏళ్ల బాలుడు మృతిచెందిన ఘటన HYDలో వెలుగుచూసింది. కాలులో చీమును తొలగించేందుకు బాలుడిని తల్లిదండ్రులు బంజారాహిల్స్ రోడ్ నంబర్.12లోని టీఎక్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో గుండెపోటు రావడంతో బాలుడు మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యంతో తమ కుమారుడి ప్రాణాలు పోయాయని తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

News July 7, 2025

WGL: క్వింటా పత్తి ధర రూ.7,550

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ సోమవారం పునఃప్రారంభమైంది. అయితే మార్కెట్‌కు పత్తి అంతంత మాత్రంగానే వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అయితే ధర మాత్రం భారీగానే పలికినట్లు చెప్పారు. గతవారం గరిష్ఠంగా క్వింటా పత్తి ధర రూ.7,565 నమోదవగా.. నేడు రూ.7,550కి చేరింది. ప్రస్తుతం పత్తి అందుబాటులో లేని సమయంలో ఇంత ధర పలకడం రైతులకు కొంత నిరాశ కలిగించే విషయం.