News January 26, 2025
పెద్దపల్లి: అభయహస్తం ఆరు గ్యారంటీ పథకాల అమలు వివరాలు

పెద్దపల్లి జిల్లాలో అభయహస్తం ఆరు గ్యారంటీ పథకాల అమలు వివరాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం కింద 2 కోట్ల 40 లక్షల జీరో టికెట్లను మహిళలకు ఆర్టీసీ బస్సులు జారీ చేసింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద 1,16,807 కుటుంబాలకు 3,80,718 గ్యాస్ సిలిండర్లలకు రూ11.29కోట్ల సబ్సిడీ, గృహజ్యోతి పథకం కింద రూ.54.33 కోట్లను అందించిందన్నారు.
Similar News
News November 7, 2025
వందేమాతర 150వ సంవత్సరోత్సవం: పెద్దపల్లి కలెక్టర్

వందేమాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి కావడం సందర్భంగా ఈనెల 7వ తేదీ ఉదయం 9:45 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
News November 7, 2025
కట్టెల పొయ్యిపై వంట చేస్తే చర్యలు: వనపర్తి కలెక్టర్

జిల్లాలోని మధ్యాహ్నం భోజనం అందించే ప్రభుత్వ పాఠశాలలకు కలెక్టర్ నిధుల నుంచి LPG సిలిండర్లు ఇప్పించడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సిలిండర్ తీసుకున్న తర్వాత కట్టెల పొయ్యిపై వంట చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు సిలిండర్ అందని పాఠశాలలను గుర్తించి వెంటనే సిలిండర్ అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News November 6, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: పెద్దపల్లి కలెక్టర్

మంథని నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్కింగ్ చేసిన ఇళ్లు, బేస్మెంట్ స్థాయికి చేరుకునేలా పనులు వేగవంతం చేయాలని, నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లు రద్దు చేయాలని ఆదేశించారు. పెట్టుబడి సమస్యలుంటే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలని సూచించారు. నిర్మాణ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.


