News July 8, 2025
పెద్దపల్లి: ‘అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలి’

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి పెండింగ్‌లో ఉంచకుండా వాటిని పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డీ.వేణుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలపై దరఖాస్తులను సమర్పించారు. ఈ ప్రజావాణిలో సంబంధిత జిల్లా అధికారులు ఉన్నారు.
Similar News
News July 8, 2025
వనపర్తి: ఆర్టీసీ ఛార్జీలు మోత.. ప్రయాణికులపై భారం

RTCచార్జీలు పెంచడంతో ప్రయాణికులపై భారం పడింది. టోల్ ఛార్జీలు పెరగడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 10RTC డిపోలు ఉండగా అధిక బస్సులు హైద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. వనపర్తి నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో 2టోల్ గేట్లు ఉండగా బస్సు టికెట్ పై రూ.10నుంచి రూ.20వరకు పెంచారు. వనపర్తి నుంచి కొత్తకోట మీదుగా హైదరాబాద్‌కు 2టోల్ గేట్లు కాగా బిజినేపల్లి మీదుగా 1టోల్‌గేట్ ఉంది.
News July 8, 2025
మండపేటకి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం

పారిశుధ్య నిర్వహణలో మండపేట టాప్‌లో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందింది. పురపరిపాలన శాఖ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహించారు. శానిటేషన్ విభాగంలో ఇంటింటికీ చెత్తను సేకరణ, పరిశుభ్రతలో రాష్ట్రంలో 77 మున్సిపాలిటీలను సర్వే చేశారు. ప్రథమ స్థానంలో మండపేట మున్సిపాలిటీ ఉందని కమిషనర్ పి.సంపత్ కుమార్ సోమవారం తెలిపారు.
News July 8, 2025
రేపు కార్మిక సంఘాల భారత్ బంద్

కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ 10 కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఐక్యవేదిక రేపు (జులై 9) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బ్యాంకింగ్, పోస్టల్, ఇన్సూరెన్స్ వంటి రంగాలకు చెందినవారు బంద్‌లో పాల్గొననున్నారు. రైతులతో కలిపి 25 కోట్ల మంది పాల్గొంటారని ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత తెలిపారు. 10ఏళ్లుగా వార్షిక కార్మిక సమావేశం పెట్టకుండా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఆరోపించారు.