News January 4, 2025
పెద్దపల్లి: ఆస్పత్రిలో యువకుడి మృతి.. బంధువుల ఆందోళన

కమాన్‌పూర్ మండలం పేరపల్లికి చెందిన ఆకుల శ్రావణ్(26) గురువారం జ్వరంతో బాధపడుతూ పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్ పరీక్షలు చేసి ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నాయంటూ జాయిన్ చేసుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రావణ్ మృతి చెందాడు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యులతో డాక్టర్ చర్చలు జరపడంతో ఆందోళన విరమించారు.
Similar News
News February 15, 2026
కరీంనగర్ మేయర్ పీఠం కమలం వశమే!

కరీంనగర్ నగరపాలక సంస్థలో కమల వికాసం ఖాయమైంది. బీజేపీ గెలిచిన 30 స్థానాలకు తోడు, ఇప్పటికే ఇద్దరు చేరగా.. తాజాగా శనివారం మరో ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీజేపీ బలం ఎక్స్-అఫీషియో ఓటుతో కలిపి 35కు చేరి, మ్యాజిక్ ఫిగర్ (34) దాటింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు తాజా చేరికలతో గండిపడింది.
News February 14, 2026
KNR: కాంగ్రెస్ నేతపై దాడి.. కేసు నమోదు

కరీంనగర్ రాజకీయ కక్షలతో కాంగ్రెస్ నాయకుడు శ్యాంసుందర్ రెడ్డిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కార్పొరేటర్ భూమయ్య భార్యకు మద్దతుగా ప్రచారం చేశారనే కోపంతో, మాజీ కార్పొరేటర్ సోదరుడు జంగిలి సతీశ్‌తో పాటు మరికొందరు ఆయనపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.
News February 14, 2026
కరీంనగర్ పీఠంపై ‘క్యాంపు’ రాజకీయం

కరీంనగర్ నగర పాలక సంస్థలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. 30 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, మరో ఇద్దరిని చేర్చుకొని బలాన్ని 32కు పెంచుకుంది. పీఠం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఏఐఎఫ్‌బీ పార్టీలు ఏకమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు చేజారకుండా ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.


