News August 26, 2024
పెద్దపల్లి: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూపులు!

పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తామని ఊరించినప్పటికి, జిల్లాలో కనీసం 1000 మంది లబ్ధిదారులకు ఇళ్లు కట్టించలేదు. అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించి 8 మాసాలు గడవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. కాగా జిల్లా వ్యాప్తంగా 1,85,404 దరఖాస్తుల వచ్చాయి. మొదటి విడతలో జిల్లాకు 10,500 ఇళ్లను కేటాయించారు.
Similar News
News February 14, 2026
KNR: కాంగ్రెస్ నేతపై దాడి.. కేసు నమోదు

కరీంనగర్ రాజకీయ కక్షలతో కాంగ్రెస్ నాయకుడు శ్యాంసుందర్ రెడ్డిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కార్పొరేటర్ భూమయ్య భార్యకు మద్దతుగా ప్రచారం చేశారనే కోపంతో, మాజీ కార్పొరేటర్ సోదరుడు జంగిలి సతీశ్‌తో పాటు మరికొందరు ఆయనపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.
News February 14, 2026
కరీంనగర్ పీఠంపై ‘క్యాంపు’ రాజకీయం

కరీంనగర్ నగర పాలక సంస్థలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. 30 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, మరో ఇద్దరిని చేర్చుకొని బలాన్ని 32కు పెంచుకుంది. పీఠం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఏఐఎఫ్‌బీ పార్టీలు ఏకమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు చేజారకుండా ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
News February 14, 2026
JMKT: ఒకరికి సున్నా.. ఆరుగురికి ఒక్కటే ఓటు!

జమ్మికుంట మున్సిపాలిటీలో కొందరు అభ్యర్థులకు వచ్చిన ఓట్లు చూస్తుంటే.. కనీసం వారి ఇంట్లోని వారు కూడా వారికి ఓటు వేయలేదా? అన్న సందేహం కలుగుతోంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 6వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థికి సున్నా ఓట్లు వచ్చాయి. అంటే ఆమెకు సొంత ఓటు కూడా పడకపోవడం గమనార్హం. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఇద్దరు జనసేన అభ్యర్థులకు ఒకే ఒక ఓటు రావడం స్థానికంగా చర్చకు దారితీసింది.


