News December 11, 2025

పెద్దపల్లి: ఈనెల 21న జాతీయ లోక్‌ అదాలత్‌

image

ఈనెల 21న పెద్దపల్లి జిల్లాలోని అన్ని కోర్టులలో లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత తెలిపారు. ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందుగా లోక్‌ అదాలత్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. కక్షిదారులు తప్పనిసరిగా తమ తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వి.భవానీ ఉన్నారు.

Similar News

News December 15, 2025

సా.5 గంటల తర్వాత ప్రచారం నిషేధం: కలెక్టర్ ప్రావీణ్య

image

సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 17న ఎన్నికలు జరిగే మండలాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారంపై నిషేధం అమల్లోకి వస్తుందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. తదుపరి 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరైనా ప్రచార నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు సహకరించాలని సూచించారు.

News December 15, 2025

ఒకే రోజు రెండుసార్లు పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ <<18569611>>ఉదయం<<>> నుంచి రెండుసార్లు బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.1,470 పెరిగి రూ.1,35,380కు చేరింది. 6 రోజుల్లోనే రూ.5,940 పెరగడం గమనార్హం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,350 ఎగబాకి రూ.1,24,100 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,15,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 15, 2025

విస్సన్నపేట: సూట్లు వేసి కోట్లలో కుంభకోణం..!

image

విస్సన్నపేట కేంద్రంగా రూ.కోట్ల కుంభకోణానికి పాల్పడిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. చదువు రానివారికి సూట్లు వేసి, ఫోటోలను డిజిటల్‌గా మార్చి డైరెక్టర్లుగా చూపించి ప్రజలను మోసం చేశారు. ఈ విషయం తెలుసుకుని బాధితులు విస్తుపోతున్నారు. డైరెక్టర్ల నుంచి రికవరీ చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు.