News February 28, 2025
పెద్దపల్లి: ఈ వ్యక్తి తెలిస్తే.. సమాచారం ఇవ్వండి: రైల్వే పోలీసులు

పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (40)కి నిన్న రాత్రి తీవ్ర గాయాలు అయినట్లు రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. బాధితుడిని అత్యవసర చికిత్స కోసం కరీంనగర్ తరలించినట్లు పేర్కొన్నారు. అతడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవన్నారు. అతడిని గుర్తు పడితే 9949304574 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
Similar News
News February 26, 2026
గ్లోబల్ లీడర్‌గా మోదీ అరుదైన రికార్డు

ఇటు ఇజ్రాయెల్, అటు పాలస్తీనా.. పరస్పరం విరుద్ధమైన దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన గ్లోబల్ లీడర్‌గా మోదీ నిలిచారు. తాజాగా ఇజ్రాయెల్ పార్లమెంటులో ‘స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్’ను ప్రదానం చేశారు. 2018లో పాలస్తీనా ‘గ్రాండ్ కాలర్’తో సత్కరించింది. గొడవల్లో ఉన్న రెండు దేశాలను మెప్పించి ఇలాంటి గౌరవం పొందడం మోదీ దౌత్యనీతికి నిదర్శనమని విశ్లేషకులు కొనియాడుతున్నారు.
News February 26, 2026
రంపచోడవరం డీఎస్పీ బదిలీ

రంపచోడవరం డీఎస్పీ జి.సాయి ప్రశాంత్ బదిలీ అయ్యారు. 25మంది డీఎస్పీలను ప్రాధాన్యత లేని పోస్ట్‌లలో వేయాలని హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు వారిని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ పేరు కూడా ఉంది. కాగా ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారనేది పేర్కొనలేదు.
News February 26, 2026
యాదాద్రి: స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తుల జయజయధ్వానాల మధ్య కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.


