News December 17, 2025

పెద్దపల్లి: ఉదయం 9 వరకు పోలింగ్ ఎంతంటే..?

image

పెద్దపల్లి జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బుధవారం ఉదయం 9 వరకు 22.50 శాతం పోలింగ్ నమోదైంది. ఎలిగేడు మండలంలో 22.56 శాతం, ఓదెల మండలంలో 19.50 శాతం, పెద్దపల్లి మండలంలో 21.80 శాతం, సుల్తానాబాద్ మండలంలో 26.08 శాతం పోలింగ్ రికార్డైంది.

Similar News

News December 17, 2025

జనగామ: ఉ.11 గంటలకు పోలింగ్ శాతం ఎంతంటే?

image

జనగామ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలను అధికారులు ప్రకటించారు.
★ పాలకుర్తి మండలంలో: 49.78 శాతం
★ దేవరుప్పుల మండలంలో: 55.98శాతం
★ కొడకండ్ల మండలంలో: 50.10 శాతం
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

News December 17, 2025

నిజామాబాద్ జిల్లాలో 54.69 శాతం పోలింగ్

image

తుది దశ GP ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 12 మండలాల్లోని 165 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
*ఆలూర్ మండలంలో 56.96%
*ఆర్మూర్ – 56.64 %
*బాల్కొండ – 49.08%
*భీంగల్ -58.68 %
* డొంకేశ్వర్ -56.62 %
*కమ్మర్పల్లి -52.96 %
* మెండోరా -58.14 %
* మోర్తాడ్ -51.48 %
*ముప్కాల్ – 52.77%
*నందిపేట్ – 55.41%
*వేల్పూర్ – 51.48%
*ఏర్గట్ల – 55.45%
పోలింగ్ నమోదైంది.

News December 17, 2025

ముధోల్: కెమికల్‌తో సిరా తొలగిస్తూ పట్టుబడ్డ యువకుడు

image

ముధోల్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద సిరా తొలగిస్తున్న యువకుడిని ఇంటెలిజెన్స్ పోలీసులు పట్టుకున్నారు. నయాబాదికి చెందిన ఆర్బాజుద్దీన్ ఓటు వేసి వచ్చిన మహిళల వేలిపై ఉన్న సిరా గుర్తును కెమికల్‌తో తొలగిస్తుండగా పోలీసులు గమనించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, కెమికల్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగ ఓట్లకు పాల్పడే ప్రయత్నంగా భావిస్తూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.