News February 1, 2025

పెద్దపల్లి ఎదురుచూస్తోంది.. నిర్మలమ్మ కరుణించేనా?

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం లోకసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై పెద్దపల్లి జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీమల్లికార్జున స్వామి ఆలయానికి ప్రసాద్ పథకంలో నిధులు కేటాయించడం, ఉడాన్ పథకంలో బసంత్ నగర్‌కు చోటు కల్పించడం, రామగుండంలో రైల్వే కోచ్ ఏర్పాటు, PDPLలో పలు రైళ్ల హాల్టింగ్ కల్పించాలని తదితర డిమాండ్లు ఉన్నాయి. 

Similar News

News February 21, 2026

ఆరోగ్యకరమైన జుట్టుకు చిలగడదుంప

image

చిలగడదుంపను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని ఇది అడ్డుకుంటుంది. చిలగడదుంపలో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ ఏ, సి, బి, ఇ, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు జుట్టు రాలడం, పల్చబడటాన్ని తగ్గిస్తాయి. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

News February 21, 2026

REWIND: ఆ విషాదానికి 13 ఏళ్లు

image

నేటితో 2013 హైదరాబాద్ జంట పేలుళ్లకు పదమూడేళ్లు. ఆ చీకటి రోజును ఒక్కసారి రివైండ్ చేసుకుంటే.. దిల్‌సుఖ్‌నగర్ రక్తసిక్తమైన దృశ్యాలు కళ్లముందు కదలాడుతాయి. ఉగ్రవాదులు సైకిళ్లపై అమర్చిన బాంబుల ధాటికి 18మంది బలవ్వగా 131మంది గాయపడ్డారు. ఇది భాగ్యనగరానికి ఒక మాయని మచ్చ. ఈ కేసులో ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్‌ ఉగ్రవాదులకు కోర్టు మరణశిక్ష విధించింది. నగరం గతాన్ని మర్చిపోయినా ఆ గాయం మాత్రం ఇంకా పచ్చిగానే ఉంది.

News February 21, 2026

శ్రీకాకుళం: మహిళ పొట్ట నుంచి 3.3 కిలోల కణితి తొలగింపు

image

కడుపు నొప్పితో బాధపడుతూ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి శనివారం వచ్చింది. పరీక్షించిన వైద్యులు కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం శస్త్ర చికిత్స చేసి 3.3 కిలోల కణితిని ఆ మహిళ పొట్ట నుంచి బయటకు తీశారు. పేషంట్ పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారని, అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా చేశామన్నారు.