News December 12, 2025

పెద్దపల్లి: ఎన్నికల విధుల నిర్లక్ష్యం.. షోకాజ్ నోటీసులు జారీ

image

పెద్దపల్లి జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 181 మంది ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లకపోవడం, నిర్లక్ష్యంగా పనిచేయడంపై ఈ చర్యలు తీసుకున్నారు. నోటీసులు అందుకున్న వారిలో 53 మంది పోలింగ్ అధికారులు, 128 మంది ఓపీవోలు ఉన్నారు.

Similar News

News December 12, 2025

పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష: అనకాపల్లి ఎస్పీ

image

విశాఖ పోక్సో ప్రత్యేక కోర్టు పాయకరావుపేటలో బాలికపై లైంగిక దాడి చేసిన బత్తిన దుర్గా ప్రసాద్ @ నానికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. క్రైమ్ నం.539/2020లో RFSL, DNA ఆధారాలు, బాధితురాలు, తల్లిదండ్రుల సాక్ష్యాలతో నిందితుడు దోషిగా తేలాడు. సెక్షన్ 376, 506 IPC శిక్షలు ఏకకాలంలో అమలు, బాధితురాలకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం తెలిపారు.

News December 12, 2025

హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్.. ఆరుగురికి 20 ఏళ్ల జైలు

image

మలయాళ హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్ <<18502408>>కేసులో<<>> ఆరుగురు నిందితులకు కేరళ ఎర్నాకుళం స్పెషల్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన నటుడు దిలీప్‌ను ఇటీవలే న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. మిగతా నిందితులైన సునీల్, మార్టిన్ ఆంటోనీ, మణికందన్, విజీశ్, సలీమ్, ప్రదీప్‌కు ఇవాళ శిక్ష ఖరారు చేసింది. 2017లో హీరోయిన్‌పై గ్యాంగ్‌రేప్ దేశవ్యాప్తంగా సంచలనమైంది.

News December 12, 2025

పోలియో నిర్మూలనకు సమన్వయమే కీలకం: DRO

image

పోలియో నిర్మూలన కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి (DRO) ఏక మురళి శుక్రవారం ఆదేశించారు. జిల్లా రెవెన్యూ కార్యాలయంలో పల్స్ పోలియోపై జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు అందించాలన్నారు. ఇటుక బట్టీలు, వలస కుటుంబాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచించారు.