News October 7, 2025
పెద్దపల్లి ఎమ్మెల్యే నివాసానికి మంత్రులు

ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా MLA వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సంస్థల ఎన్నికలపై వారంతా చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News October 7, 2025
నిర్మల్ కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్

నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరు, ఫొటోను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారని జిల్లా అధికారులు తెలిపారు. ఆ ఖాతా నుంచి వివిధ వ్యక్తులు, అధికారులకు మెసేజ్‌లు వస్తున్నాయని, అది పూర్తిగా నకిలీదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ అధికారులకు తెలిపినట్లు వివరించారు. ఆ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లకు ఎవరు స్పందించవద్దని ప్రజలకు సూచించారు.
News October 7, 2025
స.హ చట్టంపై అవగాహన ఉండాలి: మహేందర్ జీ

సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ మహేందర్ జీ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 5వ తేదీ నుంచి సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో మొదలయ్యాయన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు అధికారులు సమాచార హక్కు వారోత్సవాలను జిల్లాలోని డివిజన్, మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలన్నారు.
News October 7, 2025
రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం శాపంగా మారింది: హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి 22 నెలల పాలనలో చేసింది ఏమీ లేదని ఆయన పాలన వైఫల్యం ప్రజలకు శాపంగా మారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు “X’ వేదికగా విమర్శించారు. పథకాల్లో కోతలు,ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా మాటలు ఫేకుతూ ఢిల్లీకి వెళ్లి జోకుతున్నారని ఎద్దేవా చేశారు. అత్యవసర సేవలు అందించే 13 వేల మంది వైద్య సిబ్బందికి జీతాలు ఇవ్వకుంటే ఇక ఇతర శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.