News January 24, 2025

పెద్దపల్లి: ఎమ్మెల్యే సొంత డబ్బులతో రాజమల్లు విగ్రహం ఏర్పాటు

image

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు లేనిలోటు తీర్చలేనిదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా గుర్తింపు పొందిన నాయకుడు రాజమల్లు అని ఆయన కొనియాడారు. శుక్రవారం ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా తన సొంత ఖర్చులతో సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రధాన కూడలి వద్ద రాజమల్లు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.

Similar News

News November 3, 2025

ఉమెన్స్ WC ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

image

టీమ్ ఇండియా ICC ఉమెన్స్ వన్డే <<18182320>>వరల్డ్ కప్<<>> విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో కప్పు కొట్టిన భారత్‌కు రూ.39.55 కోట్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది. రన్నరప్ SA జట్టు రూ.19.77 కోట్లు అందుకుంటుంది. ఈ WCలో ప్రైజ్‌మనీ+బోనస్‌లు+పార్టిసిపేషన్ ఫీ+BCCI కార్యదర్సి దేవజిత్ సకారియా ప్రకటించిన రూ.51 కోట్లతో కలిపి మొత్తం భారత మహిళల జట్టుకు రూ.93.66 కోట్ల వరకు దక్కే అవకాశం ఉంటుంది.

News November 3, 2025

పరవాడ: తీరానికి కొట్టుకు వచ్చిన విద్యార్థి మృతదేహం

image

పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం సముద్రతీరంలో స్నానం చేస్తుండగా ఈనెల 1వ తేదీన గల్లంతైన విద్యార్థి భాను ప్రసాద్ (15) మృతదేహం ఆదివారం అదే తీరానికి కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతిని తండ్రి పెంటయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 3, 2025

పెన్షన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు

image

భర్త మరణించి మూడేళ్లు గడిచినా పెన్షన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు గోపవరం(M) సండ్రపల్లికి చెందిన చెన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా సచివాలయ అధికారుల నుంచి సరైన స్పందన లేదని వాపోయారు. అధికారులు కరుణించి, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నట్లు ఆమె కనీటి పర్యంతమయ్యారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.