News February 22, 2025

పెద్దపల్లి: ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల వద్ద సిసి కేమేరా: సీఈఓ

image

ఎమ్మెల్సీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్ లతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరా లేదా వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు జాగ్రత్తగా పోలీస్ భద్రతతో కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలన్నారు. పెద్దపల్లి కలెక్టర్లు కోయ శ్రీహర్ష, దాసరి వేణు తదితరులు ఉన్నారు.

Similar News

News July 4, 2025

ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి: కలెక్టర్

image

జీవితంలో ఒక ఉన్నత లక్ష్యం ఎంచుకొని దానికి అనుగుణంగా కష్టపడి సాధన చేసి అక్కడికి చేరుకోవాలని కలెక్టర్ బాలాజీ పిల్లలకు ఉద్బోధించారు. కలెక్టరేట్‌లో PM కేర్ పథకం కింద కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి గుర్తించిన పిల్లలతో కలెక్టర్ శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి బాగోగులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

News July 4, 2025

ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ ఎప్పుడంటే?

image

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఇతర నటీనటులతో సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం అవుతుందని, ప్రభాస్ నవంబర్ నుంచి షూట్‌లో పాల్గొంటారని మూవీ టీమ్‌కు చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ఇందులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో రెబల్ స్టార్ కనిపించనున్నట్లు సమాచారం. త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News July 4, 2025

VZM: మెడికల్ కాలేజీలో ముగిసిన శిక్షణ

image

విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెండు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ప్రిన్సిపల్ డాక్టర్ పద్మ లీల మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ విద్యార్థులకు నైపుణ్యాల ఆధారిత వైద్య విద్యను బోధించేందుకు అధ్యాపకులను సిద్ధం చేయడమే లక్ష్యంగా శిక్షణ తరగతులు కొనసాగాయన్నారు. విభిన్న విభాగాలకు చెందిన 30 మంది అధ్యాపకులచే శిక్షణ కొనసాగిందన్నారు.