News December 1, 2025

పెద్దపల్లి: ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

image

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సిరి ఫంక్షన్ హాల్ వరకు ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డా.వి.వాణిశ్రీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో డ్రగ్స్ వినియోగం, అసురక్షిత లైంగిక చర్యలు, వాడిన సిరంజిల వల్ల ఎచ్‌.ఐ.వి. వ్యాప్తి ప్రమాదం పెరుగుతోందని ఆమె చెప్పారు. యువతలో అవగాహన పెంపు అత్యవసరమని సూచించారు.

Similar News

News April 13, 2026

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త

image

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మార్కెట్లో రేటు తగ్గినా నష్టం కలగకుండా ధర లోటు చెల్లింపు పథకం(PDPS) అమలుకు శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా తెలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. దీని ప్రకారం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉంటే ఆ తేడా మొత్తాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఇది అమల్లోకి వస్తే ధర తగ్గినా రైతులకు నష్టం కలగదు.

News April 13, 2026

బ్రహ్మ చేసిన పొరపాటు ఏంటి?

image

ఉదధిలోన నీళ్లు ఉప్పలుగా జేసె
పసిడి గలుగు వాని పిపిన జేసె
బ్రహ్మదేవు సేత పదడైన సేతరా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ అందులోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి అతడిని పిసినారిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం.<<-se>>#PADHYAM<<>>

News April 13, 2026

HYD: GREAT..11ఏళ్లుగా FREE కోచింగ్

image

ప్రభుత్వ ఉద్యోగ కోసం ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు మల్కాజిగిరి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కొట్టే ఏడుకొండలు అండగా నిలుస్తున్నారు. 11 ఏళ్లుగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తూ సేవ చేస్తున్నారు. 2015లో 32 మందితో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పటికి 10 లక్షల మందికి విస్తరించింది. తన జీతంలో సుమారు 40 శాతం ఖర్చు చేస్తూ 13 సబ్జెక్టులు బోధిస్తున్నారు.