News March 18, 2026

పెద్దపల్లి: ఎల్‌పీజీ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్‌

image

పెద్దపల్లి జిల్లాలో ఎల్‌పీజీ సిలిండర్లు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగదారులు ఆందోళనతో ముందస్తు బుకింగ్‌లు చేయవద్దని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. 15 పంపిణీ కేంద్రాల ద్వారా 3-4 రోజుల్లోనే డెలివరీ జరుగుతుందని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాలో ఏవైనా సమస్యలుంటే 08728 224045 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.

Similar News

News April 8, 2026

ఇలా దొరికిపోయావేంటి షరీఫ్!

image

ఇరాన్‌కు విధించిన <<19594789>>డెడ్‌లైన్‌ను పొడిగించాలంటూ<<>> పాక్ PM షహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్‌పై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. ”Draft- Pakistan’s PM Message on X’ అనే టైటిల్‌తో మొదట పోస్ట్ చేసిన ఆయన తర్వాత దానిని ఎడిట్ చేశారు. దీంతో ఎవరో పంపిన మెసేజ్‌ను ఆయన కాపీ పేస్ట్ చేశారని, బహుశా అమెరికా పంపిన మెసేజ్ అయ్యుండొచ్చని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. US చేతిలో పాక్ కీలుబొమ్మలా మారిందని అంటున్నారు.

News April 8, 2026

కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం.. 103 మందిపై కేసులు

image

కామారెడ్డి జిల్లాలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 103 మంది పట్టుబడ్డారు. వీరికి న్యాయస్థానం రూ. 1,07,000 జరిమానా విధించగా, 21 మందికి జైలు శిక్ష పడింది. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. క్షణికానందం కోసం మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 8, 2026

కేయూలో తొలిసారిగా ప్రత్యక్ష మూల్యాంకన విధానం!

image

కాకతీయ విశ్వవిద్యాలయంలో తొలిసారిగా ప్రత్యక్షంగా మూల్యాంకనం విధానం అమలులోకి తీసుకొచ్చారు. తప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ప్రక్రియను పర్యవేక్షించే విధంగా వ్యవస్థ పని చేస్తుందని పరీక్షల నియంత్రణ అధికారులు తెలిపారు. ఈ విధానంలో ఒక అధ్యాపకుడు మూల్యాంకనం చేయని పేపర్ ఆటోమేటిక్‌గా మరొక మూల్యాంకనాధికారికి వెళ్తుందని, రోజుకు 45 పేపర్ల మూల్యాంకనాన్ని నిర్ణయించినట్లు చెప్పారు.