News December 1, 2025

పెద్దపల్లి: ఎల్లమ్మ గూడెం ఘటనను ఖండించిన యాదవులు

image

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెంలో యాదవ కుటుంబంపై మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు ప్రవర్తించిన తీరును యాదవ యువజన సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండిరచారు. ఈ రోజు పెద్దపల్లిలోని యాదవ భవన్‌లో వారు మాట్లాడారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు యాదవ సంఘం నాయకులున్నారు.

Similar News

News December 2, 2025

జగిత్యాల: సర్పంచ్ స్థానాలకు 508 నామినేషన్లు: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో రెండవ విడత 7 మండలాల్లో రెండవ రోజు నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో సర్పంచ్ స్థానాలకు 508 నామినేషన్లు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. అలాగే వార్డు మెంబర్ స్థానాలకు 1279 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ స్థానాలకు బీర్పూర్-43, జగిత్యాల-24, జగిత్యాల(R)-103, కొడిమ్యాల-99, మల్యాల-72, రాయికల్-106, సారంగాపూర్-61 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు.

News December 2, 2025

జగిత్యాల: ‘ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలనే రాండమైజేషన్’

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది 2వ రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం జగిత్యాల కలెక్టరేట్ లో జనరల్ అబ్జర్వర్ రమేష్ తో కలిసి నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలనే ఉద్దేశంతో రాండమైజేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నమన్నారు. అడిషనల్ కలెక్టర్ తదితరులున్నారు.

News December 2, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.1911, కనిష్ఠ ధర రూ.1725; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2090, కనిష్ఠ ధర రూ.2000; వరి ధాన్యం (BPT) గరిష్ఠ ధర రూ.2201, కనిష్ఠ ధర రూ.2131; వరి ధాన్యం (HMT) గరిష్ఠ ధర రూ.2301, కనిష్ఠ ధర రూ.2281; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.3011, కనిష్ఠ ధర రూ.2130గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.