News January 19, 2026
పెద్దపల్లి: ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు చేయాలి’

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. అన్ని పరిహార చెల్లింపులు సమయానికి పూర్తవ్వాలని, ప్రభుత్వ ప్రతిపాదనలు సమర్పించాలని చెప్పారు. విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు తప్పనిసరిగా దరఖాస్తు చేయాలని, విద్యాసంస్థలకు మౌలిక సదుపాయాలు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News March 29, 2026
UPDATE: యమపాశమైన టైరు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

మణుగూరు ఏరియాలోని దుర్గా కంపెనీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. డంపర్ టైరు మెయింటెనెన్స్ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలడంతో ఐదుగురు బీహార్ కార్మికులు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించగా ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెం తరలించారు. విషయం తెలిసిన సీఐటీయూ నేతలు మంద నరసింహారావు, వెంకటరత్నం ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
News March 29, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం..

మర్రిపాడు మండలం నందవరంలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుకు గురై గోగుల నవనీత్ (5) అనే బాలుడు మృతి చెందాడు. ఇంటి ఆరు బయట ఆడుకుంటున్న ఆ చిన్నారిని పాము కాటు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
News March 29, 2026
ఆస్తి పన్నుపై ఎలాంటి వడ్డీ మాఫీలేదు: కలెక్టర్

ఆస్తి పన్నుపై ఎలాంటి వడ్డీ మాఫీ లేదని,నగర ప్రజలు ఈనెల 31వ తేదీ లోపు పన్నులు చెల్లించి జరిమానా భారాన్ని నివారించుకోవాలని కలెక్టర్, జీసీడబ్ల్యూపీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ఆదివారం వరంగల్‌లో 14,37,38 డివిజన్లలో, హనుమకొండలోని 5వ డివిజన్లోని సురేంద్రపురి, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో పన్నుల సేకరణను పరిశీలించారు. ఉప కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.


