News November 21, 2025
పెద్దపల్లి: ఐపీఎస్ అధికారి బి.రామ్ రెడ్డి బదిలీ

సీఐడీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. రామ్ రెడ్డి, ఐపీఎస్ (2020) బదిలీ అయ్యారు. ఆయన్ను రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో ఉన్న శ్రీ పి. కరుణాకర్, ఎస్పీ (ఎన్సీ) బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News November 22, 2025
తెనాలి పోక్సో కోర్టు సంచలన తీర్పు

తెనాలిలో ఆరేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిల్లా డేవిడ్ రాజుకు 20 ఏళ్ల జైలు శిక్ష , రూ.10 వేల జరిమానా విధిస్తూ తెనాలి పోక్సో కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. 2021లో బహిర్భూమికి వెళ్ళిన బాలికపై డేవిడ్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కాగా శిక్ష ఖరారు చేశారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పులో చెప్పారు.
News November 22, 2025
తూ.గో: ఆయన పాడితే.. కాలం కూడా కాసేపు ఆగి వింటుంది..!

నేడు కర్ణాటక సంగీత దిగ్గజం, పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ వర్ధంతి. ఆయన కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తంలో జన్మించారు. ఏడేళ్ల నుంచే కచేరీలు ఇచ్చి బాల మేధావిగా పేరు తెచ్చుకున్నారు. గాయకుడిగా, వాయిద్యకారుడిగా కొత్త రాగాలను సృష్టించారు. జాతీయ ఉత్తమ గాయకుడిగా ప్రభుత్వం నుంచి అవార్డు పొందారు. తెలుగుజాతి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు.
News November 22, 2025
ADB: చేయి తడిపితేనే.. ఫైల్ ముందుకు

అవినీతి అధికారులు సామాన్యులను పీడిస్తున్నారు. ఆసిఫాబాద్ సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ వెంకటనరసింహారావు, టెక్నికల్ అసిస్టెంట్ మణికాంత్ రూ.75,000 లంచం తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో పది కంటే తక్కువ కేసులు నమోదయ్యేవి. ప్రజల్లో చైతన్యం రావడంతో లంచం డిమాండ్ చేస్తూ ఈ ఏడాది 21 మంది ఏసీబీకి చిక్కారు. ఎవరైనా లంచం అడిగితే 1064/9440446106, ADB DSP 9154388963కి కాల్ చేయండి.


