News October 28, 2025
పెద్దపల్లి కలెక్టర్‌ను కలిసిన నూతన ఎంపీడీవోలు

గ్రూప్-1 నియామకాలలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు కేటాయించిన ముగ్గురు ఎంపీడీవోలు మంగళవారం సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్‌కు చెందిన కంకణాల శ్రీజ రెడ్డి (509 ర్యాంకు) మంథని ఎంపీడీవోగా, జగిత్యాలకు చెందిన వేముల సుమలత (609వ ర్యాంకు) అంతర్గాం ఎంపీడీవోగా, కరీంనగర్‌కు చెందిన సాదినేని ప్రియాంక (446వ ర్యాంకు) కమాన్‌పూర్ ఎంపీడీవోగా నియమితులయ్యారు.
Similar News
News October 29, 2025
భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడే తొలి టీ20

భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి T20 మ్యాచ్ ఇవాళ కాన్‌బెర్రాలోని మనూక ఓవల్ మైదానంలో జరగనుంది. మ.1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభవుతుంది. ODI సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన IND, 5 మ్యాచుల T20 సిరీస్‌ను గెలవాలని భావిస్తోంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.
IND XI (అంచనా): అభిషేక్ శర్మ, గిల్, తిలక్, సూర్య(C), శాంసన్, దూబే, అక్షర్, సుందర్/కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్
News October 29, 2025
VKB: నకిలీ కరెన్సీ.. ఇద్దరికి 10ఏళ్ల జైలు శిక్ష

నకిలీ కరెన్సీ కేసులో ఇద్దరికి 10ఏళ్ల జైలు శిక్ష రూ.20 వేలు జరిమానా కోర్టు విధించింది. 2016లో A1 గోడాల అలవేలు, A2 గణేశ్ రెడ్డి విజయ బ్యాంకులో నకిలీ నోట్లను డిపాజిట్ చేయడానికి వచ్చారు. బ్యాంకు మేనేజర్ గుర్తించి పెద్దేముల్ PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దీంతో నిందితులకు ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ జడ్జి డా.ఎస్.శ్రీనివాస్ రెడ్డి శిక్ష విధించినట్లు SP K.నారాయణ రెడ్డి తెలిపారు.
News October 29, 2025
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ముజఫర్ నగర్ విద్యార్థి

నవంబర్లో గుంటూరులో జరగబోయే రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-14 క్రికెట్ పోటీలకు ముజఫర్ నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్.షాకీర్ ఎంపికైనట్టు పాఠశాల హెడ్మాస్టర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సుదర్శన్ రావు, శేఖర్ మీడియాతో మాట్లాడారు. కర్నూలులో జరిగిన ఎంపిక పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి ఉద్యమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు తెలిపారు.


