News April 5, 2025
పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలి

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం పెద్దపల్లిలో జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి అధ్యక్షతన జిల్లాస్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 12, 2025
టెన్త్ పరీక్ష ఫీజు రూ.50

వచ్చేఏడాది జరగనున్న టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు తేదీని ఇన్ఛార్జ్ DEO పాటిల్ మల్లారెడ్డి వెల్లడించారు. రేపటి నుంచి ఈనెల 25 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.50 రుసుముతో డిసెంబర్ 3వ తేదీ వరకు, రూ.200తో 10వ తేదీ వరకు, రూ.500తో 15వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125, ఒకసారి ఫెయిలైన వారు 3 కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలన్నారు.
News November 12, 2025
సీరం వాడుతున్నారా?

చర్మ సంరక్షణలో సీరం కీలకపాత్ర పోషిస్తుంది. మీకున్న చర్మ సమస్యకు తగిన సీరం ఎంచుకోవడం ముఖ్యం. విటమిన్ సి సీరం వృద్ధాప్య ఛాయల్ని, హ్యాలురోనిక్ యాసిడ్ ఉన్న సీరం చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ముఖంపై ముడతలు ఉంటే రెటినాల్ సీరం, కాలుష్యం వల్ల దెబ్బతిన్న చర్మానికి బీటా కెరొటిన్, గ్రీన్ టీ, బెర్రీలు, దానిమ్మ, ద్రాక్ష గింజల సారం ఉన్న సీరం మంచిది. సున్నిత చర్మం ఉంటే యాంటీఇన్ఫ్లమేటరీ సీరం ఎంచుకోవాలి.
News November 12, 2025
పాఠశాలల తనిఖీలకు 7 బృందాలు: అడిషనల్ కలెక్టర్

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల నిరంతరం తనిఖీలు చేసేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు హనుమకొండ అడిషనల్ కలెక్టర్, డీఈవో వెంకట్ రెడ్డి వెల్లడించారు. హై స్కూళ్ల తనిఖీలకు మూడు, ప్రైమరీ స్కూళ్లకు మూడు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు ఒకటి చొప్పున మొత్తం 7 జిల్లా స్థాయి బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు స్కూళ్లను తనిఖీలు చేస్తూ అక్కడున్న అన్ని పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదిస్తారన్నారు.


