News February 22, 2025
పెద్దపల్లి: కాంగ్రెస్ రూ.50వేల కోట్ల దోపిడీ: బండి సంజయ్

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ వేసిందన్నారు. కేంద్ర బడ్జెట్‌పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆరోపించారు.
Similar News
News November 8, 2025
ముగిసిన జగిత్యాల జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ నామినేషన్ ప్రక్రియ

జగిత్యాల జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ 2025-27 కార్యవర్గం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈరోజుతో ముగిసినట్లు జిల్లా అడహక్ కమిటీ సభ్యుల వెల్లడించారు. మెయిన్ బాడీ 7 పదవులకు 9 నామినేషన్లు, జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లకు 18 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు. ఈరోజు 2 పదవులకు విత్ డ్రా చేసుకున్నారని, ఈనెల 15న ఎన్నికలు నిర్వహిస్తామని, పాస్టర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
News November 8, 2025
బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ అధికారిగా డా.ఎం.సత్య ప్రకాష్

స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో KNR ప్రాంతీయ సమన్వయ అధికారిగా డాక్టర్ ఎం.సత్య ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ప్రాంతీయ సమన్వయ అధికారిగా పనిచేసిన డా.వంగల శ్రీనివాస్ ఉద్యోగ విరమణ పొందగా ఈ బాధ్యతను వీరు స్వీకరించారు. ఈ సందర్భంగా SRR కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
News November 8, 2025
వరంగల్ మార్కెట్‌కు రెండు రోజుల సెలవు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.


