News January 22, 2025

పెద్దపల్లి: కాంట్రాక్ట్ ప్రాతిపదికన గైనకాలజిస్ట్ పోస్టులకు ఆహ్వానం

image

కాంట్రాక్ట్ గైనకాలజిస్ట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ పోస్టును కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను బయోడేటా తో పాటు జిల్లా ఆసుపత్రి నందు అందించాలని వివరాలకు 8499061999 నెంబర్‌ను సంప్రదించాలని డీసీహెచ్వో ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Similar News

News July 7, 2025

కరీంనగర్ జిల్లాలో ఉన్నత స్థానాల్లో మల్యాల వాసులు

image

మల్యాలకు చెందిన ఇరువురు వ్యక్తులు ఉన్నత స్థాయి ఉద్యోగాలతో కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. మల్యాలకు చెందిన వాసాల సతీష్ కుమార్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో అసిస్టెంట్ కమిషనర్‌గా, అలాగే సీనియర్ న్యాయవాది మల్యాల ప్రతాప్ కరీంనగర్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన వీరిరువురు ఉన్నత స్థానాల్లో ఉండడం పట్ల మల్యాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News July 7, 2025

వికారాబాద్‌కు 10,657 రేషన్ కార్డులు మంజూరు

image

ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజల కష్టాలు దూరం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10,657 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఆయా రేషన్ కార్డుల్లో మొత్తం 88,374 మంది కుటుంబీకులు ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు రావడంతో జిల్లాలో 506 మెట్రిక్ టన్నుల బియ్యం కోట పెరిగింది. ఈనెల 14న CM రేవంత్ రెడ్డి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన తర్వాత జిల్లాలో ప్రజాప్రతినిధులు రేషన్ కార్డులు అందజేయనున్నారు.

News July 7, 2025

నూజివీడు IIITలో 141 సీట్లు ఖాళీ

image

నూజివీడు IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల ఇటీవల భర్తీ పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 869 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 141 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.