News November 6, 2025
పెద్దపల్లి: కాల్వ శ్రీరాంపూర్‌లో యువకుడి ఆత్మహత్య

కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన నీరటి రాజు (31) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మద్యం అలవాటు కారణంగా కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయని, బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన రాజు గురువారం ఉదయం తిరిగొచ్చి ఇంట్లో ఉరివేసుకున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
Similar News
News November 6, 2025
మహబూబాబాద్‌లో జువెనైల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో త్వరలో జువెనైల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు కానున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎండీ అబ్దుల్ రఫీ ప్రకటించారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో తెలిపారు. 18 ఏళ్ల లోపు ఉన్న బాలలు నేరాలకు పాల్పడితే, వారిని నేరస్థులుగా కాకుండా చట్టంతో ఘర్షణ పడిన వారిగా గుర్తించి, ఈ బోర్డు ద్వారా విచారిస్తారని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
News November 6, 2025
సచివాలయాలకు అందరికీ ఆమోదయోగ్యమైన పేరే: మంత్రి డోలా

AP: ప్రజల కోరిక మేరకే గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మారుస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన పేరే పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థలో సీఎం చంద్రబాబు సమగ్ర మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుందని మంత్రి విమర్శించారు.
News November 6, 2025
NRPT: విద్యార్థుల్లో నేర్చుకునే ఉత్సాహాన్ని పెంపొందించాలి: కలెక్టర్

ఉపాధ్యాయులు విద్యార్థుల్లో నేర్చుకునే ఉత్సాహాన్ని పెంపొందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం చదువుల పండుగ కార్యక్రమంలో భాగంగా సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రూపొందించిన కలలు కనేద్దాం, నేర్చుకుందాం, సాధిద్దాం నినాదంతో గోడ ప్రతులను నారాయణపేట కలెక్టర్ విడుదల చేశారు. ప్రతి పాఠశాలలో ఈనెల 10 నాటికి క్విజ్ స్పెల్ బీ పూర్తి చేయాలని ఆదేశించారు.


