News June 7, 2024

పెద్దపల్లి: కూలర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్‌.. ఒకరి మృతి

image

పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన రైతు నల్ల శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కూలర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాస్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Similar News

News October 2, 2024

కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

image

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. చిల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహరించాలని మండిపడ్డారు. రాష్ట్ర పరిపాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనం అన్నారు. మూసీపై బీఆర్ఎస్ వైఖరిని తెలపాలన్నారు. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఒక్క ఇల్లు కూడా కూలగొట్టమని అన్నారు.

News October 2, 2024

విజయభారతికి నివాళులర్పించిన కేటీఆర్

image

ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా తల్లి, ప్రముఖ రచయిత్రి విజయభారతి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాహుల్ బొజ్జ నివాసానికి వెళ్లి వారీ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. విజయ భారతి మరణం బాధాకరమని ఆవేదన చెందారు. విజయభారతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

News October 2, 2024

రాహుల్ గాంధీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

image

హైడ్రా విషయంలో రాహుల్ గాంధీపై సిరిసిల్ల MLA కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్ట్‌ను రాహుల్ గాంధీ డబ్బుల సంచుల కోసమే అనుమతి ఇచ్చాడని బుధవారం విలేకరుల చిట్ చాట్‌లో ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీ హైడ్రాను నడిపిస్తున్నాడన్నారు. రాహుల్ గాంధీ వెనుక ఉండి పేదల ఇండ్ల పైకి బుల్డోజర్ నడిపిస్తుండని స్పష్టం చేశారు.