News February 25, 2026

పెద్దపల్లి: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ పాఠశాలల్లో 2026-27 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ తెలిపింది. మండల స్థాయి ఎంపికలు మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు మండల కేంద్రాల్లో, మార్చి 28న జిల్లా స్థాయి ఎంపిక పోటీలు పెద్దపల్లి ఐటిఐ గ్రౌండ్‌లో, 27 ఏప్రిల్ హకీంపేటలో రాష్ట్రస్థాయి ఫైనల్ ఎంపికలు జరుగుతాయని పేర్కొంది.

Similar News

News February 25, 2026

అనకాపల్లి: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 585 మంది గైర్హాజర్

image

జిల్లాలో 34 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 585 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 13,939 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,354 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి ఎం. వినోద్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అసౌకర్యం కలక్కుండా ఏర్పాట్లు చేశామన్నారు.

News February 25, 2026

జమ్మికుంట: రెండు రోజులుగా నిలకడగానే పత్తి ధర

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో బుధవారం పత్తి ధరలు నిన్నటి లాగా నిలకడగానే కొనసాగాయి. మార్కెట్‌కు పత్తి రాక సాధారణంగా ఉన్నప్పటికీ రెండు రోజులుగా ధరల్లో పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం. మొత్తం 24 వాహనాల ద్వారా 205 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ.7,550, కనిష్టంగా 7,000 ధర పలికింది. పత్తిలో తేమ శాతం తక్కువగా ఉండి, నాణ్యత బాగున్న పంటకు గరిష్ట ధర లభిస్తోందని అధికారులు సూచిస్తున్నారు.

News February 25, 2026

SRCL: ‘డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి’

image

జిల్లాలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని కలెక్టరేట్‌లో నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స అందించాలన్నారు.