News March 30, 2025

పెద్దపల్లి: గురుకులంలో ప్రవేశాలు.. రేపే లాస్ట్ డేట్

image

తెలంగాణ మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 6 నుంచి 9వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, అనాథలు అర్హులని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న నిర్వహించనున్నారు. హాల్‌టికెట్లు ఏప్రిల్ 15 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, దరఖాస్తు గడువు మార్చి 31న ముగియనుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Similar News

News November 10, 2025

పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి: తుల రవి

image

డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని అందించే రాష్ట్ర స్థాయి పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి తల రవి తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు ఈనెల 19వ తేదీలోగా వివిధ కేటగిరీలలోని పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకుhttps://wdsc.telangana.gov.in సంప్రదించాలన్నారు.

News November 10, 2025

భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లు పూర్తికావాలి: కలెక్టర్

image

ఈ నెల 14,15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న భాగ‌స్వామ్య స‌దస్సు ఏర్పాట్లు 12వ తేదీ సాయంత్రం నాటికి పూర్తికావాల‌ని అధికారుల‌కు క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్రసాద్ నిర్దేశించారు. క‌లెక్టరేట్లో అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ఎక్క‌డా ఎలాంటి స‌మ‌న్వ‌య లోపం రాకుండా అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొన్నారు. స‌దస్సులో ఉపరాష్ట్రప‌తి, గవ‌ర్న‌ర్, సీఎం, కేంద్రమంత్రులు భాగ‌స్వామ్యం కానున్నార‌ని సూచించారు.

News November 10, 2025

మెదక్: ఆర్మీకి ఆర్ధికంగా సహకరిద్దాం: అదనపు కలెక్టర్

image

ఆర్మీకి సహాయ సహకారాలు, ఆర్ధికంగా సహకరిద్దామని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో భారత స్కౌట్ అండ్ గైడ్స్ వారోత్సవాల్లో భాగంగా భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ స్టిక్కర్‌ను ఆవిష్కరించారు. ఆవిష్కరించిన స్టిక్కర్స్‌ను పాఠశాల స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు విక్రయించగా వచ్చే డబ్బులను ఆర్మీ, సహాయ సహకారాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.