News January 27, 2025

పెద్దపల్లి: గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి పసుపు రంగు షర్టు ధరించాడని, వయస్సు 60 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పారు. జిల్లాలో ఎవరైనా అదృశ్యమైతే సంప్రదించాలని పోలీసులు సూచించారు.

Similar News

News July 4, 2025

GWL: ‘సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు. గంట వీధికి చెందిన ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు లింక్ పంపి అందులో చేరితే లాభాలు వస్తాయని నమ్మించి రూ.4.29 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.50 వేలు, సెకండ్ రైల్వే గేట్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.2.64 లక్షలు, నదీ అగ్రహారానికి చెందిన వ్యక్తికి లోన్ ప్రాసెస్ చేస్తామని రూ.40 వేలు దోచే యత్నం చేయగా ఖాతాలు ఫ్రీజ్ చేశామన్నారు.

News July 4, 2025

తహశీల్దార్లు మరింత ఫోకస్ చేయాలి: BHPL కలెక్టర్

image

భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కరానికి తహశీల్దార్లు మరింత ఫోకస్ చేయాలని, షెడ్యూల్ సిద్ధం చేసి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ హాలులో ఆయన భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు పరిష్కారానికి తీసుకున్న చర్యలపై అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేయాలని ఆయన సూచించారు.

News July 4, 2025

మొగల్తూరు: కారు ఢీకొని రైతు మృతి

image

పేరుపాలెం నార్త్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు గుత్తుల పెద్దిరాజు మృతి చెందారు. పేరుపాలెం బీచ్ నుంచి భీమవరం వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ పక్కనే పచ్చగడ్డి కోస్తున్న పెద్దిరాజును కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న వారికి ఏమి కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.