News August 29, 2025
పెద్దపల్లి: ‘గ్రామ పంచాయతీ తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 2న విడుదల’

PDPL జిల్లా పరిధిలో గ్రామ పంచాయతీ తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఆగస్టు 28న విడుదలైన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఆగస్టు 30లోపు అందజేయాలని కోరారు. వచ్చిన అభ్యంతరాలను ఆగస్టు 31లోపు పరిశీలించి తుది జాబితా రూపొందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News August 29, 2025
మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు: ఎస్ఈ

వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ శ్యాంబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండపాల నిర్వాహకులు లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్లతోనే పనులు చేయించాలని సూచించారు. తగిన సామర్థ్యం ఉన్న ఫ్యూజ్ వాడాలని, ఓవర్ లోడ్ అవ్వకుండా చూసుకోవాలని అన్నారు. ఎంసీబీలు, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్లు ఉపయోగించాలని అన్నారు. నాణ్యమైన వైర్లు వాడాలన్నారు.
News August 29, 2025
MBNR: ముగిసిన పీజీ పరీక్షలు.. 1,113 మంది హాజరు

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎమ్మెస్‌డబ్ల్యూ, ఎంకాం రెగ్యులర్ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు నేటితో ముగిశాయి. పీజీ ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి, అబ్జర్వర్ డాక్టర్ నాగం కుమారస్వామి పర్యవేక్షించారు. విశ్వవిద్యాలయ పరిధిలో 1,196 మంది విద్యార్థులకు గాను 1,113 మంది హాజరయ్యారని, 83 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నియంత్రణ అధికారి డా.కే.ప్రవీణ తెలిపారు.
News August 29, 2025
MNCL: 31న ఉచిత నేత్ర చికిత్స నిర్ధారణ శిబిరం

మంచిర్యాలలోని లయన్స్ భవన్ లో ఈ నెల 31న ఉచిత నేత్ర చికిత్స నిర్ధారణ శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, శ్యామ్ సుందర్ రావు, ఐ క్యాంప్స్ జిల్లా కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. శిబిరంలో 50 ఏళ్లు పైబడిన వారికి పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారికి మరుసటి రోజు ఉచితంగా కంటి శస్త్ర చికిత్స చేయనున్నట్లు పేర్కొన్నారు.