News March 13, 2025

పెద్దపల్లి: గ్రూప్-1లో సత్తా చాటిన స్నేహ

image

పెద్దపల్లి జిల్లా పెగడపల్లి బతికపల్లి గ్రామానికి చెందిన స్నేహ గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో 517 మార్కులు సాధించింది. కాగా, స్నేహ ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తూ ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా 517 మార్కులతో 485వ ర్యాంకు సాధించింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News April 15, 2026

తిరుచానూరులో మిథాలి రాజ్ పూజలు

image

మాజీ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద సూపరింటెండెంట్ రమేశ్, ఏవిఎస్వో రాధాకృష్ణ ఆమెకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న మిథాలి రాజ్‌కు అర్చకులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయాధికారులు ఆమెకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

News April 15, 2026

నితీశ్‌ను గద్దె దించుతానని శపథం చేసి..

image

బిహార్ CMగా ఎన్నికైన BJP నేత సామ్రాట్ చౌదరి 2023లో నితీశ్ కుమార్‌ను గద్దె దించుతానని శపథం చేశారు. అప్పటివరకు తన కాషాయ తలపాగా తీయనని ప్రకటించారు. ఆనాడు ఆయన నితీశ్ రాజకీయ ప్రత్యర్థి. 2024లో JDU, BJP కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. దీంతో సామ్రాట్ శపథాన్ని పక్కనపెట్టి తలపాగా తీసి అయోధ్యలో రాముడికి సమర్పించారు. విచిత్రం ఏమిటంటే నిన్న నితీశ్ CM పదవికి రాజీనామా చేయగా ఇవాళ సామ్రాట్ గద్దెనెక్కనున్నారు.

News April 15, 2026

నేడు లక్నోతో RCB ఢీ.. కోహ్లీ ఆడతారా?

image

IPLలో భాగంగా ఇవాళ LSGతో RCB తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడతారా లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ముంబైతో మ్యాచ్‌లో కోహ్లీకి గాయమైంది. ఈ క్రమంలో ఫీల్డింగ్‌కు రాలేదు. నిన్న నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినప్పటికీ కాలికి పట్టీతో కనిపించారు. అయితే ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్ చేశారని, మ్యాచ్ సమయానికి ఫిట్‌గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.