News December 23, 2025

పెద్దపల్లి: గ్లోబల్‌ తెలంగాణ అసోసియేషన్‌ కన్వెన్షన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

image

పెద్దపల్లిలో గ్లోబల్‌ తెలంగాణ అసోసియేషన్‌ మెగా కన్వెన్షన్‌ పోస్టర్‌ను ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ చాప్టర్‌ అధ్యక్షుడు వేల్పురి సంపత్‌ రావు మాట్లాడుతూ.. ఈ నెల 27, 28 తేదీలలో హైదరాబాదులోని గండిపేటలో గల అక్షయ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరుగనుందని తెలిపారు. అసోసియేషన్‌ పెద్దపల్లి చాప్టర్‌ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News December 24, 2025

KNR: ఈ నెల 25 నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

image

స్థానిక అంబేడ్కర్ హాకీ స్టేడియంలో ఈ నెల 25 నుంచి 28 వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరగనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ పాటర్న్ ప్రసాదరావు వెల్లడించారు. నేడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ పోటీలకు 33 జిల్లాల నుంచి క్రీడాకారులు రానున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

News December 24, 2025

పాన్-ఆధార్ లింక్ చేశారా? DEC 31 వరకే గడువు

image

పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువు DEC 31తో ముగియనుంది. ఆలోగా లింక్ చేయకపోతే పాన్ రద్దవుతుంది. లింక్ చేసేందుకు IT ఈ-ఫైలింగ్ <>పోర్టల్‌కి<<>> వెళ్లి ‘లింక్ ఆధార్’ క్లిక్ చేసి వివరాలు, OTP ఎంటర్ చేయాలి. ఫీజు పే చేశాక మళ్లీ ‘లింక్ ఆధార్’లో డీటెయిల్స్, OTP వెరిఫై చేస్తే పాన్, ఆధార్ లింక్ అవుతాయి. కాగా డీయాక్టివేట్ అయిన 2017 జులైకి ముందు PANను యాక్టివ్ చేసుకోవాలంటే రూ.1000 ఫైన్ చెల్లించాలి.

News December 24, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓తాసిల్దారులతో జిల్లా కలెక్టర్ సమావేశం
✓నరసింహ అవతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య
✓పినపాక: గోదావరిలో యువకుడి మృత దేహం లభ్యం
✓చర్ల: అక్రమ గోవుల తరలింపును అడ్డుకున్న గోరక్షకులు
✓కొత్తగూడెంలో ఘనంగా సింగరేణి డే వేడుకలు
✓పోలీసు అధికారులతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం
✓పాల్వంచ పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
✓రాంజీ బిల్లుకు వ్యతిరేకంగా కొత్తగూడెంలో నిరసన
✓కిన్నెరసాని రివర్ వాక్ చేపట్టిన కలెక్టర్